• Home »
  • Cable »
  • ఇండియాకాస్ట్ తో డిస్నీ ఇండియా పంపిణీ ఒప్పందం రద్దు

ఇండియాకాస్ట్ తో డిస్నీ ఇండియా పంపిణీ ఒప్పందం రద్దు

భారతదేశంలో తమ ఎనిమిది చానల్స్ పంపిణీ కోసం ఇండియాకాస్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని డిస్నీ ఇండియా రద్దు చేసుకుంది. దీంతో ఇండియాకాస్ట్ పంపిణీ నుంచి డిస్నీ, డిస్నీ జూనియర్, డిస్నీ ఎక్స్ డి, హంగామా టీవీ, బిందాస్, బిందాస్ ప్లే, యుటీవీ మూవీస్, యుటీవీ యాక్షన్ వైదొలగినట్టయింది. ఇకమీదట ఈ చానల్స్ చందాల వసూళ్ళు, ప్లేస్ మెంట్ చార్జీల చెల్లింపు వంటి కార్యకలాపాలన్నీ సంస్థాగతంగానే నిర్వహించుకుంటాయి.
డిస్నీ చానల్స్ గ్రూప్ లో నెంబర్ వన్ కిడ్స్ చానల్, నెంబర్ వన్ యూత్ చానల్, ప్రముఖ్ళ మూవీస్ చానల్ ఉండటంతో బాటు వైవిధ్యభరితమైన ప్రసారాలు అందిస్తూ ఉండటం వల్ల ఇండియాకాస్ట్ కు ఈ గ్రూప్ చాలా కీలకంగా ఉంటూ వచ్చింది.

అయితే , ఇలా ఉపసంహరించుకోవటం అక్రమమంటూ డిస్నీ ఇండియా మీద ఇండియాకాస్ట్ సంస్థ టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పిల్లేట్ ట్రైబ్యునల్ (టిడిశాట్) లో 28 న ఫిర్యాదు చేసింది. అయితే, ఆ పిటిషన్ అనర్హమైనదని పేర్కొంటూ, 24 గంటల్లోగా ఉపసంహరించుకోని పక్షంలో తానే రద్దు చేయాల్సి ఉంటుందని ఇండియాకాస్ట్ ను టిడిశాట్ హెచ్చరించింది. మరింత సమయం కావాలని ఇండియా కాస్ట్ కోరగా మరో రోజు ఆగిన తరువాత ఈ రోజు టిడిశాట్ ఆ పిటిషన్ ను ఉపసంహరించుకున్నదానిలా పరిగణిస్తూ రద్దుచేసింది.