• Home »
  • BARC »
  • ఉదయ న్యూస్ మీద ఖర్చెంత, జీతాలెంత? పోరుబాటలో సిబ్బంది, రేపే సమావేశం

ఉదయ న్యూస్ మీద ఖర్చెంత, జీతాలెంత? పోరుబాటలో సిబ్బంది, రేపే సమావేశం

ఉదయ న్యూస్ చానల్ ను మూసివేస్తూ సన్ నెట్ వర్క్ చేసిన ప్రకటనతో ఆ చానల్ సిబ్బంది దిగ్భ్రాంతికి గురయ్యారు. కన్నడ న్యూస్ విభాగం ప్రారంభమైనప్పటినుంచీ 19 ఏళ్ళుగా పనిచేస్తున్నవారు కూడా కొంతమంది ఉన్నారు. ఉన్నట్టుండి సన్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం సమంజసం కాదని, ఇన్ని కుటుంబాలు ఒకేసారి వీధిన పడతాయని అంటున్నారు.  సన్ నెట్ వర్క్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ రేపు సమావేశం జరపాలని నిర్ణయించుకున్నట్టు ఒక సీనియర్ ఉద్యోగి చెప్పారు.

నష్టాలు వస్తున్నాయని చెబుతున్న యాజమాన్యం ఈ చానల్ సిబ్బందికి ఇస్తున్న జీతాలను మార్కెట్ లోని మిగతా చానల్స్ తో ఏనాడైనా పోల్చి చూసుకుందా అని ప్రశ్నిస్తున్నారు. మౌలిక సదుపాయాలతోబాటు సిబ్బంది జీతాలమీద చేస్తున్న ఖర్చును పోల్చి చూసినప్పుడు రేటింగ్స్ కూడా అందుకు తగినట్టే వస్తున్నాయంటున్నారు. ఇతర చానల్స్ లో ఇచ్చే జీతంలో సగం కంటే తక్కువ ఇస్తూ రేటింగ్స్ ఘనంగా రావాలంటే ఎలా సాధ్యమని కూడా ప్రశ్నిస్తున్నారు.

కన్నడ మార్కెట్లో న్యూస్ చానల్స్ రేటింగ్స్

చానల్ కర్నాటక రూరల్ అర్బన్ బెంగళూరు
టీవీ 9 126 114 143 168
పబ్లిక్ టీవీ 86 74 101 121
సువర్ణ న్యూస్ 43 41 47 52
ఈటీవీ న్యూస్ 34 38 30 35
బి టీవీ 30 25 35 54
ఉదయ న్యూస్ 17 18 16 20
దిగ్విజయ్ 24X7 16 17 14 11
కస్తూరి న్యూస్ 15 16 13 9
ప్రజా టీవీ 11 10 13 11
సుద్ది టీవీ 8 8 8 7
సమయ 8 8 9 8
రాజ్ న్యూస్ 6 4 9 9
జనశ్రీ న్యూస్ 3 4 3 1