• Home »
  • Editors Voice »
  • కర్నూలు మహాలక్ష్మి, ఎసిటి సంస్థలకు తెలుగు టీవీ ఇన్ఫో క్షమాపణలు

కర్నూలు మహాలక్ష్మి, ఎసిటి సంస్థలకు తెలుగు టీవీ ఇన్ఫో క్షమాపణలు

కర్నూలు మహాలక్ష్మి, ఎసిటి సంస్థలకు తెలుగు టీవీ ఇన్ఫో క్షమాపణలు

డిజిటల్ ప్రసారాలకోసం కర్నూలు మహాలక్ష్మి సంస్థ మరో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నదంటూ తెలుగు టీవీ డాట్ ఇన్ఫో ప్రచురించిన వార్త ఎవరినీ నొప్పించటానికి గాని, విభేదాలు కల్పించటానికి గాని ఉద్దేశించినది కాదు. నిజానికి ఆ రెండు సంస్థలూ పేరు మోసినవేనన్న విషయం ప్రస్తావించాం. వ్యాపార వ్యూహాలలో భాగంగా ఎవరికి వారు తమ సంస్థల ప్రయోజనాల కోసం నిర్ణయాలు తీసుకుంటారు. అంతమాత్రాన ఆయా సంస్థలమధ్య విభేదాలు ఉన్నట్టు కాదు. అదే వ్యాపార స్ఫూర్తిని ప్రతిబింబించినా, ఆ వార్త ఇబ్బంది కలిగించినందుకు చింతిస్తున్నాం.
ఎసిటి సంస్థను గాని, దాని నిర్వాహకులనుగాని, మహాలక్ష్మి సంస్థను గాని ఆ సంస్థ నిర్వాహకులైన సత్యనారాయణ (సత్య) గారిని గాని ఇబ్బంది పెట్టటమో, వారికి మనస్తాపం కలిగంచటమో, అభిప్రాయ భేదాలు సృష్టించటమో, వ్యాపార సంబంధాలను చెడగొట్టమో ఆ వార్త లక్ష్యం కాదు.
అందువల్లనే అభ్యంతరం వ్యక్తమవుతున్నట్టు తెలియగానే వార్తను పూర్తిగా ఉపసంహరించుకున్నాం. వ్యక్తిగతంగా గాని, వ్యాపార పరంగా గాని ఆ వార్త వలన ఇబ్బంది కలిగి ఉంటే ఇటు మహాలక్ష్మి సంస్థకు, అటు ఎసిటి కి, వాటి నిర్వాహకులకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాం.

భావనారాయణ, ఎడిటర్, తెలుగు టీవీ ఇన్ఫో