కలర్స్ గొడుగు కిందికి రిశ్తే చానల్స్

కలర్స్ బ్రాండ్ పేరు ప్రఖ్యాతులను వాడుకునే క్రమంలో వయాకామ్ 18 సంస్థ తన హిందీ మూవీ చానల్ రిశ్తే సినీప్లెక్స్ ను, హిందీ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్ రిశ్తేను ఇప్పుడు కలర్స్ గొడుకు కిందికి తీసుకురావాలని నిర్ణయించింది. మార్చి 1 నుంచి ఈ రెండు చానల్స్ కలర్స్ పేరు తగిలించుకొని  కలర్స్ సినీప్లెక్స్, కలర్స్ రిశ్తే పేర్లతో ప్రసారమవుతాయి. పట్టణప్రాంత ప్రేక్షకులకోసం ప్రీమియం పే చానల్స్ గా ఇవి అందుబాటులోకి వస్తాయి.

గత దశాబ్దకాలంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెంది విశేషంగా ప్రేక్షకాదరణ పొందిన చానల్ గా కలర్స్ కు ఉన్న ప్రతిష్ఠను వాడుకుంటూ సరికొత్త కార్యక్రమాలు, చిత్రాలతో మరింత మంది ప్రేక్షకులకు చేరువ కావాలని నిర్ణయించుకున్నట్టు వయాకామ్18 ప్రతినిధి నైనా జైపురియా చెప్పారు. ఎదుగుదలను ప్రతిబింబిస్తూ లోగోలలో కూడా మార్పులు చేశామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!