• Home »
  • Top Stories »
  • కాజల్ కి ప్రసారభారతి బోర్డు సభ్యత్వం ?

కాజల్ కి ప్రసారభారతి బోర్డు సభ్యత్వం ?

Kajol Prasara Bharati

ప్రసారభారతిలో ఖాళీగా ఉన్న నలుగురు సభ్యుల స్థానాలను భర్తీచేయటానికి కసరత్తు  మొదలైంది. ప్రముఖ సినీనటి కాజల్ పేరు కూడా ఇందులో ఉంది. సమాచార, ప్రసారాల  మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన జాబితాకు ఉపరాష్ట్రపతి లాంఛనంగా ఆమోదముద్ర వేసిన  తరువాత్ర అధికారికంగా ప్రకటన వెలువడవచ్చునని తెలుస్తోంది. మొత్తానికి అంతా  అనుకున్నట్టు జరిగితే మొదటి సారిగా ఒక పేరుమోసిన సెలెబ్రిటీకి ప్రసారభారతిలో స్థానం  లభించినట్టవుతుంది.

దూరదర్శన్ కు కొత్తరూపం కల్పించటానికి, వాణిజ్యపరంగా లాభదాయకంగా మార్చటానికి  కృషి జరుగుతున్న సమయంలో కాజల్ ఎంపిక జరిగినట్టు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి, సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ కార్యదర్శి, ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ సమావేశమై ఖరారు చేశాక జాబితా విడుదలవుతుంది. ఈ జాబితాలోని మిగిలిన ముగ్గురూ అనూప్ జలోటా, అశోక్ టాండన్, మిన్హాజ్ మర్చంట్.

ప్రసార భారతి బోర్డులో చైర్మన్, సీఈవో, ఆర్థిక వ్యవహారాల సభ్యుడు, సిబ్బంది వ్యవహారాల సభ్యుడు, ఆరుగురు పార్ట్ టైమ్ సభ్యులు ఉంటారు. వీరికితోడు సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ప్రతినిధి, ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ డైరెక్టర్ జనరల్  ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. పార్ట్ టైమ్ సభ్యులలో నాలుగు ఖాళీలను ఇప్పుడు భర్తీచేస్తున్నారు.