టాటా స్కై vs ట్రాయ్: 13 కి వాయిదా వేసిన ఢిల్లీ హైకోర్టు

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) మీద ఢిల్లీ హైకోర్టులో టాటా స్కై చేస్తున్న న్యాయ పోరాటం ఈ నెల 13 కి వాయిదా పడింది. ఈ కేసులో టాటా స్కై తో బాటు మరో రెండు డిటిహెచ్ సంస్థలు ఎయిర్ టెల్ డిజిటల్, సన్ డైరెక్ట్ కూడా ఉన్నాయి. మరోవైపు ట్రాయ్ ఇప్పటికే టాట్ స్కై కి, ఎయిర్ టెల్ డిజిటల్ కు ట్రాయ్ షో కాజ్ నోటీసులు చేయటం గమనార్హం.

టాటా స్కై తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ నెల 4న వాదనలు ముగించగా డిస్కవరీ ఇండియా కమ్యూనికేషన్ తరఫు న్యాయవాది గోపాల్ జైన్ వాదనలు ప్రారంభించారు. వచ్చే వాయిదా నాడు వాదనలు ముగించే అవకాశముంది. అంతకుముందు స్టార్ ఇండియా దాఖలు చేసిన కేసు ట్రాయ్ అధికారాన్ని సవాలు చేయగా ఈ కేసు పే చానల్స్ బొకేల డిస్కౌంట్ పరిమితి తొలగింపు మీద దృష్టిపెట్టింది. ientatij#�tru�

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!