ట్రాయ్: ఆఖరి నిమిషంలోనూ అబద్ధాలే

ఈ రోజు అర్థరాత్రి తరువాత కొత్త టారిఫ్ ఆర్డర్ అమలులోకి వస్తుండగా ట్రాయ్ ఈ రోజు నాలుగు పేజీల పత్రికాప్రకటన విడుదల చేసింది. అయితే అందులో సగం పాత సోది, మిగతాది తన సహజసిద్ధమైన అబద్ధాల ప్రచారం. చందాదారులు తమ ఛాయిస్ తెలియజేయటం దాదాపుగా పూర్తయినట్టు సమాచారం అందిందని, కొంతమంది మాత్రం సర్వీస్ ప్రొవైడర్ల వెబ్ సైట్ పని చేయటం లేదని ఫిర్యాదు చేశారని ట్రాయ్ చెబుతోంది. డిజిటైజేషన్ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఎన్నో అబద్ధాలు చెప్పిన ట్రాయ్ ఇలా చెబుతుందని పంపిణీ దారులకు ముందే తెలుసు.

డిటిహెచ్ లో ప్రీపెయిడ్ చందాదారులుంటే వాళ్ళ క్రెడిట్ నిల్వ ఆధారంగా సేవలు కొనసాగుతాయని చెప్పింది. ఒక “పెద్ద సర్వీస్ ప్రొవైడర్ “  తన పరిధిలోని టీవీల తెరమీద బ్లాకౌట్ కు కారణం కాగా  వెంటనే షో కాజ్ నోటీస్ జారీచేసి సేవలు పునరుద్ధరించినట్టు చెప్పిన ట్రాయ్ ఆ సర్వీస్ ప్రొవైడర్ పేరు చెప్పటానికి  ఇబ్బంది పడింది. నిజమైన ఛాయిస్ కు అవకాశం లేకుండా ఎవరైనా సొంత పాకీజీలు రుద్దుతుంటే ఫిర్యాదు  das@trai.gov.in కు మెయిల్ చేయాలని చెప్పింది. కానీ 1% మెయిల్స్ కు కూడా ఇప్పటివరకూ సమాధానాలివ్వలేకపోయింది.

ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లుంటే  ఏ మాత్రం తగ్గిస్తున్నారో చెప్పవలసిందిగా పంపిణీ సంస్థలను కోరుతున్నట్టు, అవసరమైతే జోక్యం చేసుకుంటామని చెబుతోంది. ఇది ఆపరేటర్ల ఆదాయాన్ని తగ్గించే పనికాబట్టి కచ్చితంగా అమలుచేసే అవకాశముంది.

కొత్త టారిఫ్ ఆర్డర్ వలన కేబుల్ బిల్లుల భారం పెరిగిందని క్రిసిల్ సంస్థ సర్వే ఫలితాలు వెల్లడించగా, అసలు క్రిసిల్ కి పంపిణీ మార్కెట్ మీద అవగాహన లేదంట్ ట్రాయ్ తేలిగ్గా కొట్టిపారేసింది. ఇప్పటివరకు తనకు అందిన సమాచారం ప్రకారం మెట్రో నగరాలలో ప్రజలకు 10 నుంచి 15% డబ్బు ఆదా అయిందని, ఇతర పట్టణాలలో 5నుంచి 10 శాతం ఆదా అయిందని చెబుతోంది. చందాదారులందరూ తాము చూడాలనుకుంటున్న చానల్స్ నే  తెలివిగా ఎంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ పత్రికాప్రకటనను ముగించింది. d��57c�

One thought on “ట్రాయ్: ఆఖరి నిమిషంలోనూ అబద్ధాలే

  • February 6, 2019 at 7:26 PM
    Permalink

    Anna Bhavanarayana you are giving excellent info through this site regarding tv industry

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!