డిడి ఫ్రీడిష్ నుంచి పెద్ద చానల్స్ ఔట్

దూరదర్శన్ ఫ్రీడిష్ నుంచి నాలుగు పెద్ద బ్రాడ్ కాస్టర్లు మార్చి 1 నుంచి తప్పుకోవాలని నిర్ణయించారని డిష్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ జవహర్ గోయల్ వెల్లడించారు. స్టార్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా,  వయాకామ్18, టీవీ 18 పంపిణీ సంస్థ అయిన ఇండియా కాస్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ ఉమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నాయి.

నిజానికి ఫ్రీడిష్ కు ఒక విధంగా, మిగిలిన డిటిహెచ్ ఆపరేటర్లకు, ఎమ్మెస్వోలకు మరో విధంగా ధర నిర్ణయించటానికి వీలు లేదు గనుక  ఉచితంగా ఇవ్వటం సాంకేతికంగా కూడా ట్రాయ్ నిబంధనలకు వ్యతిరేకమవుతుంది. మరోవైపు ఫ్రీడిష్ కారేజ్ ఫీజు అనూహ్యంగా నిర్ణయించటం కూడా ఈ ఉమ్మడి నిర్ణయానికి దారితీసి ఉంటుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

తమ పే చానల్స్ లో ప్రసారమైన కార్యక్రమాలనే కొద్దిపాటి మార్పులతో కాస్త ఆలస్యంగా ప్రసారం చేయటానికి స్టార్ ఉత్సవ్, జీ అన్మోల్, రిష్టే, సోనీ వాహ్, స్టార్ ఉత్సవ్ మూవీస్, జీ అన్మోల్ సినిమా చానల్స్ ఫ్రీడిష్ ను వాడుకుంటూ వచ్చాయి. దాదాపు మూడు కోట్ల కనెక్షన్లుండటంతో  ప్రకటనల ఆదాయం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే, తాజా నిబంధనలు, పెరిగిన కారేజ్ ఫీజు వల్ల బైటికి రావాలని నిర్ణయించాయి. మరోవైపు విడిగా పే చానల్స్ గా ఉన్నప్పటికీ ఫ్రీడిష్ లో ఉచితంగా ఇస్తున్న స్టార్ భారత్, సోనీ పాల్, రిష్టే సినీప్లెక్స్ కూడా ఉన్నాయి.

డిడి ఫ్రీడిష్ చందాలు వసూలు చేసి ఇవ్వదు గనుక బ్రాడ్ కాస్టర్లనుంచి కారేజ్ ఫీజు అడగటం అన్యాయమనేది బ్రాడ్ కాస్టర్ల వాదన. కానీ ప్రసార భారతి మాత్రం డిడి ఫ్రీడిష్ లో స్లాట్స్ వేలం వేయటానికిఒక సరికొత్త విధానాన్ని రూపొందించి ఇటీవలే ప్రకటించింది. హిందీ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్, టెలీషాపింగ్ చానల్స్ కు  అత్యధికంగా రూ. 15 కోట్లు, రెండో విభాగంలో హిందీ సినిమా చానల్స్ కు రూ 12 కోట్లు. మూడో విభాగమైన హిందీ మ్యూజిక్, స్పోర్ట్స్ , భోజ్ పురి జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ కు 10 కోట్లు రిజర్వ్ ధరగా నిర్ణయించారు. హిందీ, ఇంగ్లీష్, పంజాబీ న్యూస్ చానల్స్  నాలుగో విభాగంలో ఉండగా వీటికి రూ.7 కోట్లు, మిగిలిన అన్ని రకాల చానల్స్ ను 6 కోట్ల రిజర్వ్ ధరలోకి చేర్చారు.

ఇలా ఉండగా,  ఫ్రీడిష్ స్లాట్స్  వేలం విధానాన్ని సవాలు చేస్తూ 9x మీడియా, టీవీ విజన్, బి4యు బ్రాడ్ బాండ్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఉచిత చానల్స్ దగ్గర కారేజ్ ఫీజు వసూలు చేయటం సమంజసం కాదని  పిటిషనర్లు వాదించారు. ఏ చానల్స్ ఎన్ని ఉన్నాయో అనే లెక్కలేకుండా స్లాట్ కేటాయించటాన్ని కూడా ప్రశ్నించారు. అయితే, వాణిజ్యపరంగా ఉన్న అవకాశాలను వాడుకోవటంలో ప్రసార భారతికి అడ్డుపడబోమని కోర్టు స్పష్టం చేసింది.

ఇప్పుడు పెద్ద బ్రాడ్ కాస్టర్లు వైదొలగటంతో డిడి ఫ్రీడిష్ వేలానికి ఎంత స్పందన వస్తుందనేది చాలా అనుమానంగా ఉంది. వేలంలో ఆశించిన ఆదాయం రాకపోవచ్చునన్నదే ఇప్పుడు ప్రసార భారతిని కూడా వేధిస్తున్న సమస్య, పైగా, చందాదారులు కూడా  ఫ్రీడిష్ పట్ల పెద్దగా ఆసక్తి చూపే అవకాశం లేకపోవటంతో ప్రకటన దారులుకూడా ముందుకు రారన్న అనుమానాలు సాగుతున్నాయి. ����W@

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!