డిడి ఫ్రీడిష్ లోమరో వేలం

ప్రసార భారతి ఆధ్వర్యంలో నడిచే ఉచిత డిటిహెచ్ వేదిక ఈ మధ్యనే ఎంపెగ్ 2 స్లాట్స్ వేలం విజయవంతంగా ముగించి దాదాపు 400 కోట్ల మేరకు సంపాదిచగా ఇప్పుడు తాజాగా ఎంపెగ్ 4 స్లాట్స్ వేలానికి సిద్ధమైంది. మార్చి 27 నుంచి ఈ-వేలం పద్ధతిలో ఈ స్లాట్స్ అమ్మకం జరుగుతుంది. అన్ని భాషలకు చెందిన, అన్ని అంశాలకు చెందిన చానల్స్ వేలంలో పాల్గొనవచ్చు.

రిజర్వ్ ధర కేవలం రూ. 5 లక్షలుగా నిర్ణయించారు. లైసెన్స్ ఉన్న చానల్స్ ఏవైనా ఈ వేలంలో పాల్గొనవచ్చు/ సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ దగ్గర నమోదు చేసుకున్న విదేశీ ప్రభుత్వ బ్రాడ్ కాస్టర్లు కూడా ఇందులో పాల్గొనటానికి అర్హమని ప్రసార భారతి ప్రకటించింది. రకరకాల కారణాల వలన ఎంపెగ్ 2 వేలంలో పాల్గొనలేకపోయినవారు కూడా ఇప్పుడు పాల్గొనవచ్చునని ప్రసార భారతి సీఈవో శశి వెంపటి ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!