తిరంగా టీవీ పేరుకు టిడిశాట్ అనుమతి

వీకాన్ మీడియా అండ్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ తన కొత్త చానల్ హార్వెస్ట్ టీవీ న్యూస్ పేరు తిరంగా టీవీగా మార్చుకోవటానికి టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ టైబ్యునల్ ( టిడిశాట్) అనుమతించింది. అయితే ట్రైబ్యున తుది నిర్ణయం తీసుకునేదాకా  తన లోగోలో కాషాయ, ఆకుపచ్చ రంగులు వాడుకోబోవటం లేదని  వీకాన్ సంస్థ వెల్లడించింది.

తిరంగా టీవీ పేరు, లోగో జాతీయ పతాక నిబంధనావళికి విరుద్ధమని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ట్రైబ్యునల్ లో వాదించింది. జాతీయ చిహ్నాలను వాడుకోకూడదని చట్టం చెబుతున్నదని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించింది. వీకాన్ సంస్థ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్  సిబల్ వాదనలు కూడా విన్న తరువాత తాత్కాలిక ప్రాతిపదికన తిరంగా టీవీ లోగో వాడుకోవటానికి అనుమతిస్తున్నట్టు టిడిశాట్ ఆదేశించింది.

కాంగ్రెస్ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి కూడా అయిన కపిల్ సిబల్ హార్వెస్ట్ టీవీకి పెట్టుబడి పెట్టారు. ప్రముఖ జర్నలిస్టులు బర్ఖాదత్, కరన్ థాపర్ ఈ చానల్ కోసం పనిచేస్తున్నారు. జనవరి 26 న మొదలైన చానల్ వివాదాల్లో చిక్కుకుంది. పేరు, లోగో విషయంలో ఎం ఐ బి అభ్యంతరం చెప్పటంతో ప్రధాన వివాదం మొదలైంది. screeF�����

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!