తీవ్రవాద దాడుల వార్తల ప్రసారంలో మార్గదర్శకాలు పాటించాలి

తీవ్రవాదుల దాడులకు సంబంధించిన వార్తల ప్రసారంలో సంయమనం పాటించాలని, గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను అనుసరించాలని కోరుతూ ప్రభుత్వం ప్రైవేట్ టీవీ చానల్స్ కు మరోమారు ఆదేశాలు జారీచేసింది. జమ్మూకాశ్మీర్ లో జరిగిన ఆత్మాహుతి దాడి నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. 1995 నాటి కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్స్ రెగ్యులేషన్ చట్టం, దాని నిబంధనలను ఉటంకిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ ప్రకటన జారీ చేసింది.

విధ్వంసానికి, హింసాత్మక ఘటనలకు దారితీసేలా ఉండే ఎలాంటి కార్యక్రమాలూ ప్రసారం చేయకూడదని, జాతి సమగ్రతకు భంగం కలిగించే అవకాశమున్న కార్యక్రమాలు ప్రసార చేయకూడదని స్పష్టం చేసింది.  జాతివ్యతిరేకతను ప్రోత్సహించే  ఎలాంటి కార్యక్రమాన్నీ ప్రసారం చేయకూడదని గుర్తు చేసింది. ప్రసార నియమావళిని ఉల్లంఘించే ఎలాంటి  కార్యక్రమాలూ ప్రసారం చేయవద్దని ఆ ఆదేశాలలో ప్రభుత్వం పేర్కొంది ���3s���`

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!