తొలి వారంలోనే 7 కోట్లమందిని చేరిన రిపబ్లిక్ భారత్

ఆర్ణబ్ గోస్వామి హిందీ చానల్ రిపబ్లిక్ భారత్ మొదటి వారంలోనే 7 కోట్ల 30 లక్షల మందిని చేరినట్టు బార్క్ లెక్కలు తేల్చటంతో  ఆ చానల్ త్వరలోనే నెంబర్ వన్ స్థానం చేరుకుంటుందని నిర్వాహకులు ధీమాతో ఉన్నారు. హిందీ న్యూస్ చానల్స్ విభాగంలో ఇంతకుముందు మరే చానల్ కూ ఇలాంటి ప్రారంభం లేదు. ఇంతపెద్ద సంఖ్యలో ప్రేక్షకులను చేరటానికి ఏళ్ళ తరబడి ఆగిన చానల్స్ చాలా ఉన్నాయి.

2017 లో ఇంగ్లీష్ న్యూస్ చానల్స్ రిపబ్లిక్ టీవీ ప్రారంభించి ఆర్ణబ్ గోస్వామి సంచలనాలకు తెరతీసిన విషయం తెలిసిందే. టైమ్స్ తో పోటీపడి నెంబర్ వన్ స్థానంలో స్థిరంగా కొనసాగుతూ వస్తోంది. ఇప్పుడు  హిందీలో అడుగుపెడుతూ రిపబ్లిక్ భారత్ ప్రారంభించినప్పుడు ఇండియా టీవీతో వివాదం రావటం, అక్కడి యాంకర్ ను తీసుకున్న విషయంలో కోర్టుద్వారా విజయం సాధించటం కూడా తెలిసిందే.

ఎన్నికల సమయంలోనే చానల్ రావటం, ప్రేక్షకులకు బాగా చేరువ కావటంలో సరికొత్త రికార్డులు స్థాపించటం ఆ చానల్ కుఅనుకూలమైన వాతావారణానికి అద్దం పడుతోంది. అయితే, ఏ మేరకు రేటింగ్స్ సంపాదించుకుంటుందో ముందు ముందు తేలాల్సి ఉంటుంది. రిపబ్లిక్ టీవీ నిర్వాహకులు మాత్రం త్వరలో హిందీలో కూడా నెంబర్ వన్ స్థానం ఖాయమంటున్నారు. \”top��W�

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!