• Home »
  • Other Channels »
  • దక్షిణాదిన విస్తరణలో మరో అడుగు : షాప్ సిజె తమిళ్ ప్రారంభం

దక్షిణాదిన విస్తరణలో మరో అడుగు : షాప్ సిజె తమిళ్ ప్రారంభం

ప్రముఖ హోమ్ షాపింగ్ టీవీ చానల్ షాప్ సిజె దక్షిణాదిన ప్రాంతీయ భాషల్లో విస్తరించే క్రమంలో తెలుగు తరువాత ఇప్పుడు తమిళంలో చానల్ ప్రారంభించింది. షాప్ సిజె తమిళ్ పేరుతో ఈ చానల్ 24 గంటలూ పనిచేస్తుంది. ప్రత్యేకమైన ఆఫర్లను ప్రకటించటంతోబాటు బటర్ ఫ్లై ఇండియా, ప్రీతి లాంటి ప్రాంతీయ బ్రాండ్లను ప్రేక్షకులకు విస్తృతంగా ప్రచారం చేస్తుంది. సినీనటి త్రిష ఈచానల్ కు బ్రాండ్ అంబాసడర్ గా వ్యవహరిస్తున్నారు. తెలుగు కు ఇప్పటికే తమన్నాను ఎంచుకున్న సంగతి తెలిసిందే.

Launch Shop CJ Tamil

ప్రస్తుతం భారతదేశంలో ఎనిమిదిన్నర కోట్ల ఇళ్ళను చేరుకోగలిగిన షాప్ సిజె లో యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనెటన్, థామస్ కుక్, శామ్ సంగ్, ఎలక్ట్రోలక్స్, ప్రెస్టిజ్, రీబక్, మహారాజా, ప్యూమా, ఇంటెక్స్ లాంటి సంస్థలు అనుబంధం పెట్టుకున్నాయి. త్వరలో మరో చానల్ కూదా ప్రారంభించటానికి ఏర్పాట్లు పూర్తయినట్టు షాప్ సిజె సీఈవో కెన్నీ షిన్ వెల్లడించారు. నాణ్యమైన వస్తువులను ఇంటిదగ్గరే అందించే వ్యూహం విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

భారతదేశంలో హోమ్ షాపింగ్ నెట్ వర్క్స్ వేగంగా ఎదుగుతున్నాయని, ఆ అవకాశాన్ని షాప్ సిజె అందిపుచ్చుకున్నదని సంస్థ సీఎఫ్ వో రామకృష్ణన్ చెప్పారు. ఈ ఏడాది స్థూల వ్యాపారం రూ.1200 కోట్లు దాటిపోయే అవకాశాలున్నాట్టు వెల్లడించారు. నిరుడు రూ. 850 కోట్లుండగా గణనీయమైన పురోగతి సాధించామన్నారు. ఆదాయం పెంచుకోవటంలో తమిళ చానల్ మెరుగైన పాత్ర పోషిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదికి రూ.500 కోట్ల వ్యాపారం తమిళనాడునుంచే ఆశిస్తున్నామన్నారు.