నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు డిటిహెచ్ ఆపరేటర్ల అస్త్రం

నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు రూ.130 కింద 100 చానల్స్ ఇవ్వాలన్న ట్రాయ్ నిబంధనను అనుసరిస్తూ, ఆ పైన ఇచ్చే చానల్స్ కు అదనపు ఎన్ సి ఎఫ్ వసూలు చేయబోమని డిటిహెచ్ సంస్థలు టాటా స్కై, డిష్ టీవీ, సన్ దైరెక్ట్ ప్రకటించాయి. దీనివలన ఎన్ని ఉచిత చానల్స్ తీసుకున్నా, అదనంగా చెల్లించాల్సిన అవసరముండదు. దీనివలన హెచ్ డి చానల్స్ తీసుకున్నా అదనంగా చెల్లించనక్కర్లేదు. 

టాటా స్కై ఇందుకోసం ప్రత్యేకంగా ప్రాంతాల వారీగా పాకేజీలు రూపొందించింది. సన్ డైరెక్ట్ మరోవైపు తన గ్రూప్ చానల్స్ ను ప్రమోట్ చేసుకోవటానికి కూడా  తన డిటిహెచ్ వేదికను వాడుకుంటోంది.  పే చానల్స్ ఎక్కువగా తీసుకోవటానికి, హెచ్ డి చానల్స్ వైపు మొగ్గు చూపటానికి ఈ స్కీములు బాగా ఉపయోగపడతాయి.

అయితే, ఇలాంటి స్కీములతో ప్రజల్లోకి వెళ్ళటం సహజంగానే కేబుల్ ఆపరేటర్లకు ఇబ్బందిగా మారింది. వారి ఉపాధిని దెబ్బతీసే విధంగా డిటిహెచ్ ఆపరేటర్లు వస్తూ ఉండటంతో గట్టిగా ప్రతిఘటించటానికే మొగ్గు చూపుతున్నారు. ఇంకోవైపు చందాదారులకు నచ్చజెప్పి, దగ్గర్లో ఉంటూ సేవలందించేవారినే నమ్మాలంటూ అవగాహన కల్పించటానికి కూడా ప్రాధాన్యమిస్తున్నారు. �����

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!