• Home »
  • BARC »
  • పెరిగిన న్యూస్ చానల్స్ రేటింగ్స్, రాంకులు యథాతథం

పెరిగిన న్యూస్ చానల్స్ రేటింగ్స్, రాంకులు యథాతథం

నాలుగో వారంలోనూ టీవీ 9 తన మొదటి స్థానం కొనసాగించటమే కాకుండా రేటింగ్స్ కూడా పెంచుకోగలిగింది. ఎన్టీవీ రేటింగ్స్ కూడా పెరిగినప్పటికీ పెరుగుదల స్వల్పంగా ఉండటంతో అంతకుముందు వారంకంటే తేడా కొంత పెరిగినట్టయింది. అలా రెండో స్థానంలోనే కొనసాగుతుండగా  టీవీ 5 పెరుగుదలతో ఎన్టీవీ తో అంతరాన్ని కొంత మేర తగ్గించుకోగలిగింది.  ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, వి6 న్యూస్  కూడా రేటింగ్స్ పెంచుకున్నప్పటికీ అదే నాలుగు, ఐదు రాంకుల్లో  కొనసాగుతున్నాయి.

రాంకు చానల్ వీక్షణలు ( వేలల్లో)
1 టీవీ 9 51672
2 ఎన్టీవీ 42624
3 టీవీ 5 న్యూస్ 36699
4 ఎబిఎన్ ఆంధ్రజ్యోతి 33490
5 వి 6 న్యూస్ 31184