ఫిబ్రవరి 1 నుంచి కొత్త రేట్ల ప్రకారం చెల్లించాల్సిందే

ట్రాయ్ టారిఫ్ ఆర్డర్ ప్రకారం బ్రాడ్ కాస్టర్లు అందరూ గరిష్ట చిల్లర ధరలు అమలులోకి వచ్చినట్టేనని అందువలన ఫిబ్రవరి 1 నుంచి ఇన్వాయిస్ లు అలాగే ఇవ్వాలని నిర్ణయించామని బ్రాడ్ కాస్టర్ల సంఘం ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్  స్పష్టం చేసింది. చాలామంది పంపిణీ సంస్థలు ( ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు) ఈ విషయంలో వ్యక్తం చేస్తున్న అనుమానాల నేపథ్యంలో ఐ బి ఎఫ్ ఈ స్పష్టత ఇచ్చింది. చానల్స్ ఎంపికకు చందాదారులకు గడువు పెంచిన నేపథ్యంలో నెలవారీ చందాదారుల నివేదికలు ఎలా ఇవ్వాలి అనేది చాలామందిని వేధిస్తుండగా వివరణ అనివార్యమైందని కూడా ఫౌండేషన్ ప్రకటించింది.

కొత్త టారిఫ్ ఆర్డర్ ప్రకారమే బ్రాడ్ కాస్టర్లతో ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు ఒప్పందాలు చేసుకున్నందున  వాటికి అనుగుణంగా నడుచుకోవటమే ముఖ్యమని, అది ఫిబ్రవరి 1 న అమలులోకి వచ్చిందని ఆ ప్రకటనలో ఐబిఎఫ్ పేర్కొంది. పంపిణీ సంస్థలు కొత్త టారిఫ్ ఆర్డర్ ప్రకారం  నెలవారీ చందాదారుల నివేదికలు ప్రతి నెలా 7, 14, 21, 28 తేదీలలో పంపాల్సిన విషయాన్ని  కూడా గుర్తు చేసింది. సభ్యులందరి తరఫునా ఈ ప్రకటన జారీ చేసినట్టు కూడా ఇండియన్ బ్రాడ్ కాస్ట్ ఫౌండేషన్ స్పష్టం చేసింది.

 ఈ మార్పిడి ప్రక్రియా సాఫీగా సాగటానికి తాము పూర్తిగా సహకరిస్తామని చెబుతూ పంపిణీ సంస్థలు తగిన అత్యుత్తమ ప్లాన్ లు అందజేయటంలో తగిన చొరవ చూపాలనికోరారు. చందాదారులు కూడా మార్చి 31 లోగా పూర్తి స్థాయిలో చానల్స్ ఎంపిక పూర్తి చేయాలని ఐబిఎఫ్ విజ్ఞప్తి చేసింది. బిల్లులు మాత్రం వారం వారం ఇచ్చే నివేదికల ఆధారంగా సగటు లెక్కిస్తామని చెప్పింది.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!