మార్చిలో టీవీ9 భారతవర్ష్

టీవీ9 యాజమాన్య సంస్థ ఎబిసి ప్రైవేట్ లిమిటెడ్ వచ్చే నెలలో హిందీ చానల్ భారతవర్ష్ ప్రారంభిస్తోంది. త్వరలో జరగబోయే కీలకమైన సార్వత్రిక ఎన్నికలకు ముందు రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ వారి హిందీ చానల్ రిపబ్లిక్ భారత్ ఈ మధ్యనే మొదలవగా ఇప్పుడు ఇది హిందీ మార్కెట్లో రెండో చానల్. గతంలో ఇండియా టీవీలో పనిచేసిన ప్రముఖులు హేమంత్ శర్మ, అజిత్ అంజుమ్, వినోద్ కాప్రీ టీవీ9 భారతవర్ష్ లో చేరారు.

తనదైన శైలిలో దూకుడుతనం, పరిశోధన, సాగిస్తూ ప్రజల హక్కులు కాపాడటమే ధ్యేయంగా పనిచేస్తుందని, ఎలాంటి మూఢ నమ్మకాలనూ ప్రచారం చేయబోదని సంస్థ డైరెక్టర్ క్లిఫర్డ్ పెరీరా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటివరకు టీవీ 9 తెలుగు, టీవీ9 కన్నడ,  టీవీ9 గుజరాతీ, టీవీ9 మరాఠీ, టీవీ1, న్యూస్ 9 (ఇంగ్లీష్) ఉన్నాయి.

సీనియర్ జర్నలిస్ట్ రవిప్రకాశ్ ప్రమోట్ చేసిన ఈ సంస్థలో శ్రీనిరాజు పెట్టుబడి పెట్టటం, ఈ మధ్యనే మై హోమ్ సిమెంట్స్, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెద్ ( ఎంఇఐఎల్) సంస్థలకి శ్రీనిరాజు తన వాటాలు అమ్మి తప్పుకోవటం తెలిసిందే. ఈ సంస్థ ఆదాయం ఏటా రూ,.150 కోట్లకు పైగా ఉంది. అందులో లాభం రూ. 20 కోట్ల మేరకు ఉన్నట్టు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!