• Home »
  • Top Stories »
  • మా టీవీలో విదేశీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

మా టీవీలో విదేశీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్

Maa Star TV

 

స్టార్ ఇండియా  రూ. 2500 కోట్లతో మా టీవీని కొనుగోలు చేయటానికి సిద్ధం కాగా,  అందుకోసం విదేశీ ప్రత్యక్షపెట్టుబడులకు స్టార్ ఇండియా కు అనుమతి లభించింది. ఫారిన్  ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు నుంచి అనుమతి లభించటంతో ఇక సాఫీగా యాజమాన్య  మార్పిడి జరుగుతుంది. మా టీవీ కంపెనీ ని కొనుగోలు చేయకుండా కేవలం ఆస్తులు,  అప్పులను మాత్రమే స్టార్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

మా టీవీ నెట్ వర్క్ లో ఉన్న మా టీవీ, మా మూవీస్, మా మ్యూజిక్, మా గోల్డ్ చానల్స్ ను  స్టార్ నెట్ వర్క్ కొనుగోలు చేసింది. ఎంతమొత్తానికి అనే విషయం మొదట్లో వెల్లడించకపోయినా, ఆ తరువాత భారత కరెన్సీలో 2500 కోట్ల రూపాయలుగా లెక్కతేలింది. స్టార్ ఇండియాలో న్యూస్ చానల్స్ లేకపోవటం వలన విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల మీద కఠినమైన పరిమితులు లేవు. నిర్దిష్ట శాతానికి మించకపోవటం వలన పారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డ్ నుంచి అనుమతి లభించింది.

ముందుగా అంగీకరించిన షరతులప్రకారం వాటాలకొనుగోళ్ళు, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో మార్పిడి, సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ అనుమతులు పొందగానే బదలీ లాంఛనాలు పూర్తవుతాయి. స్టార్ ఇండియా డైరెక్టర్లకు సెక్యూరిటీ క్లియరెన్స్ ఉండి ఉండటం, ఇది కేవలం ఆస్తుల కొనుగోలు మాత్రమే కావటం వలన అనుమతులన్నీ నామమాత్రమే అవుతాయి.