రిపబ్లిక్ భారత్ మీద టీవీ 18 ఫిర్యాదు

డిజిటైజేషన్ నిబంధనల ప్రకారం ఒక వర్గానికి చెందిన చానల్స్ అన్నీ ఒకే చోట పెట్టాల్సి ఉండగా ఆ విషయంలో మొదటి సారిగా ట్రాయ్ కి ఫిర్యాదు అందింది. గత నెల 26 న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రారంభమైన రిపబ్లిక్ భారత్ అనే హింఈ న్యూస్ చానల్ మీద టీవీ 18 ఈ ఫిర్యాదు చేసింది. ఒక వైపు తమ చానల్ మొదటివారంలోనే అత్యధికంగా ప్రేక్షకులను చేరుకోగలిగినట్టు ఆ చానల్ నిర్వాహకుడైన ఆర్ణబ్ గోస్వామి చెప్పుకుంటున్న సమయంలోనే టాయ్ కి ఈ ఫిర్యాదు అందటం విశేషం.

ట్రాయ్ మార్గదర్శకాల ప్రకారం హిందీ జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ అన్నీ ఒక చోట, మ్యూజిక్ చానల్స్ అనీ ఒకచోట, మూవీ చానల్స్ అన్నీ ఒకచోట, పిల్లల చానల్స్ ఒకచోట.. అల ఒక్కో వర్గానికి చెందిన చానల్స్ అన్నీ ఒకే చోట ఉండాలి.  అది ప్రేక్షకుల ఎంపికను సులభతరం చేస్తుంది. అదే విధంగా ఎవరూ ప్రేక్షకాదరణ కోసం తమ చానల్స్ అన్నీ ఒకచోట పెట్టుకోకుండా చూస్తుంది. అయితే, ఒక వర్గానికి చెందిన చానల్స్ లో ఏ చానల్ ఎక్కడ పెట్టాలనేది పంపిణీదారుడి ఇష్టం కాబట్టి ప్లేస్ మెంట్ చార్జ్ పేరుతో ఆ నిర్దిష్టమైన స్థానం ఇచ్చినందుకు వసూలు చేసుకోవటానికి అవకాశముంది.

రిపబ్లిక్ భారత్ చానల్ ను మాత్రం హిందీ న్యూస్ చానల్స్ లో కాకుండా మరొక చోట పెట్టటం నిబంధనలకు విరుద్ధమన్న సంగతి టీవీ 18 తన ఫిర్యాదులో ప్రస్తావించింది. అలా చేయటం వల్లనే ఎక్కువ రీచ్ సాధించగలిగింఅని, ఇది సమన్యాయ సూత్రాలకు విరుద్ధమని టీవీ 18 తన ఫిర్యాదులో పేర్కొంది.

ఇంకోవైపు టీవీ టుడే నెట్ వర్క్ కూడా ట్రాయ్ కి ఫిర్యాదు చేయగా అలా చానల్ కు ప్రత్యేకమైన స్థానం కల్పించిన హర్యానా ప్రాంతపు ఎమ్మెస్వో జై మాతా దీ కేబుల్ సంస్థకు ట్రాయ్ నోటీస్ జారీచేసింది. ఫిబ్రవరి 22 లోగా సమాధానమివ్వాలని ఆ నోటీసులో పేర్కొంది. ఏయే నెట్ వర్క్స్ లో అలా రిపబ్లిక్ భారత్ నియమాలకు విరుద్ధంగా ప్లేస్ మెంట్ దక్కిందో ఆ జాబితాను కూడా ట్రాయ్ కి అందజేస్తూ విచారణ జరిపించాలని టీవీ 18 కోరింది. O�5=�m�

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!