రేటింగ్స్ ప్రకటించకపోతే కఠిన చర్యలు

ప్రేక్షకాదరణ సమాచారం లెక్కగట్టే బార్క్ సంస్థకు ట్రాయ్ నుంచి తీవ్రమైన హెచ్చరిక వచ్చింది. రెండు వారాలుగా రేటింగ్స్ సమాచారాన్ని వెబ్ సైట్ లో ఉంచకపోవటం మీద స్పందిస్తూ వెంటనే రేటింగ్స్ వెల్లడించకపోతే కఠిన చర్యలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలని ట్రాయ్ స్పష్టం చేసింది.

ట్రాయ్ ఇటీవల కొత్త టారిఫ్ ఆర్డర్ అమలు చేస్తున్న నేపథ్యంలో రేటింగ్స్ డేటా లో ఒడిదుడుకులు ఉండవచ్చునన్న అభిప్రాయంతో బార్క్ తన వెబ్ సైట్ లో డేటా ఇవ్వటం లేదు. అయితే, డేటా అందుబాటులో ఉంటే ప్రేక్షకులు దాన్ని విశ్లేషించుకోవటం ద్వారా నిర్ణయం తీసుకోగలుగుతాడని, అప్పుడు చానల్స్ కూడా ప్రేక్షకుల అభిప్రాయాన్ని గౌరవించి ధర తగ్గించటం లాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముందని ట్రాయ్ అభిప్రాయపడుతోంది.

ఫిబ్రవరి 25లోగా స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని ట్రాయ్ హెచ్చరించింది. నిజాయితీగా వ్యవహరించాలన్న నిబంధననుంచి బార్క్ వైదొలగినందున చర్యలు తప్పవని పేర్కొంది. పైగా ఫిబ్రవరి 14 న ఇచ్చిన ఆదేశాలను బార్క్ బేఖాతరు చేసిందని ట్రాయ్ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!