రేపటి హనుమకొండ ట్రాయ్ అవగాహన సదస్సు రద్దు

వినియోగదారుల అవగాహన కార్యక్రమాల నిర్వహణలో భాగంగా టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ అఫ్ ఇండియా (ట్రాయ్) 14 న ఉదయం 11 గంటలకు హనుమకొండలోని అశోకా హోటల్ లో తలపెట్టిన్ సమావేశం రద్దయింది.  కేబుల్ టీవీ డిజిటైజేషన్ అమలు కొనసాగింపులో భాగంగా ట్రాయ్ విడుదలచేసిన కొత్త టారిఫ్ ఆర్డర్ అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు చందాదారులకు వస్తున్న అనేక అనుమానాలమీద ఈ వేదిక ద్వారా అవగాహన కల్పించాలని భావించిన సంగతి తెలిసిందే.  

సదస్సు రద్దుకు స్పష్టమైన కారణాలు చెప్పకపోయినప్పటికీ చందాదారులు పాకేజీలు ఎంచుకునే గడువు మార్చి 31 వరకు పెంచటం వల్లనే వాయిదా పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇంతకంటే ముందుగా చేపట్టాల్సిన కార్యక్రమాల మీద దృష్టి సారించే ఉద్దేశంతో రద్దు చేసి ఉండవచ్చు. మళ్ళీ ఎప్పుడు జరిగేదీ తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!