• Home »
  • Cable/DTH/HITS »
  • వాడకంలో ఉన్న డిటిహెచ్ కనెక్షన్లు మూడింట రెండొంతులే

వాడకంలో ఉన్న డిటిహెచ్ కనెక్షన్లు మూడింట రెండొంతులే

డిటిహెచ్ కనెక్షన్లు తీసుకున్నవాళ్ళందరూ ఆ కనెక్షన్ వాడుకోవటంలేదు. డిటిహెచ్ కనెక్షన్ ఉన్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు మాత్రమే నిజంగా ఆ కనెక్షన్ వాడుకుంటున్నారు.దేశవ్యాప్తంగా 9 కోట్ల 46 లక్షల 10 వేల డిటిహెచ్ కనెక్షన్లున్నట్టు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) లెక్కతేల్చింది.

అయితే, అందులో 65.42%  మాత్రమే ప్రస్తుతం వాడకంలో ఉన్నాయి. పైగా అలా వాడకంలో లేని కనెక్షన్ల సంఖ్య పెరిగిపోతున్నట్టు కూడా ట్రాయ్ లెక్క చెబుతోంది. ఆరునెలల కిందట 3 కోట్ల 10 లక్షల 30 వేల కనెక్షన్లు వాడకంలో లేకపోగా ఇప్పుడాసంఖ్య 5.41% పెరిగి 3 కోట్ల 27 లక్షల 10 వేలకు చేరింది.

డిటిహెచ్ చందాదారులు

  2016 సెప్టెంబర్ 30 2016 జూన్ 30 2016 మార్చి 31 2015 డిసెంబర్ 31
చురుగ్గా ఉన్నవి 6,19,00,0000 6,05,00,000 5,85,30,000 5,59,80,000
చురుగ్గా లేనివి 3,27,10,000 3,10,30,000 3,01,10,000 2,88,20,000
మొత్తం 9,46.10,000 9,15,30,000 8,86,40,000 8,48,00,000

డిటిహెచ్ ఆపరేటర్లలో  టాటా స్కై అత్యధికంగా 495 చానల్స్ అందిస్తుండగా అన్నిటికంటే తక్కువగా సన్ డైరెక్ట్ 226 చానల్స్ మాత్రమ్ అందిస్తోంది. డిష్ టీవీలో అత్యధికంగా 232 ఉచిత చానల్స్ ఉండగా టాటా స్కై అత్యధికంగా 287 పే చానల్స్ ఇస్తోంది. డిష్ టీవీ, వీడియోకాన్ డి2హెచ్ విలీనం కావటంతో భారీ స్థాయిలో ఉన్న ఒకే ఒక డిటిహెచ్ ఆపరేటర్ గా తయారైంది. ఈ రెండూ కలిసి దాదాపు 2 కోట్ల 76 లక్షలమంది చందాదారులకు సేవలందిస్తున్నాయి. ఇప్పుడిది ప్రపంచంలొనే రెండో అతిపెద్ద డిటిహెచ్ సంస్థ.