సగానికి పైగా ఇళ్ళు కొత్త టారిఫ్ లోకి: ట్రాయ్

దేశంలో సగానికి పైగా ఇళ్ళు కొత్త టారిఫ్ కిందికి వచ్చినట్టేనని ట్రాయ్ చైర్మన్ ఆర్ ఎస్ శర్మ వెల్లడించారు. 10 కోట్ల కేబుల్ కనెక్షన్లలో 70% ఇప్పటికే మారారని డిటిహెచ్ లో మాత్రం మూడో వంతు మాత్రమే మారినట్టు సమాచారం ఉందని చెప్పారు. ఈ మార్పిడి ప్రక్రియను నిశితంగా గమనిస్తూ ఉన్నామని కూడా ఆయన వెల్లడించారు.

మార్పు చాలా వేగంగా జరుగుతున్నట్టు చెబుతూ, డిటిహెచ్ లో జాప్యానికి ప్రధాన కారణం అంతకు ముందు ఉన్న పాకేజీలకు సర్దుబాటు చేయటమేననన్నారు. కేబుల్ ఆపరేటర్లకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా వారికి వివరణలు స్తున్నామని, చందాదారుల అవగాహన కార్యక్రమాలు కూడా పెంచుతున్నామని ఆర్ ఎస్ శర్మ చెప్పారు. వీటివలన కొత్త టారిఫ్ లోకి మార్పిడి వేగం బాగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఒకే ఇంట్లో ఒకటికంటే ఎక్కువ కనెక్షన్లు ఉన్నప్పుడు నెట్ వర్క్ కెపాసిటీ ఫీజులో రాయితే ఇచ్చే అవకాశం పంపిణీదారులకే వదిలేశామని, కొంతమంది పంపిణీదారులు ఇప్పటికే ప్రత్యేకమైన స్కీములు ప్రకటించారని చెప్పారు. అయితే దీన్నొక నిబంధనగా మార్చే ఉద్దేశం ట్రాయ్ కి ప్రస్తుతానికి లేదన్నారు. it’�<��&�

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!