• Home »
  • Advertisement Code »
  • ప్రకటనల మీద పరిమితి కేసు సెప్టెంబర్ 8 కి వాయిదా

ప్రకటనల మీద పరిమితి కేసు సెప్టెంబర్ 8 కి వాయిదా

గంటకు 12 నిమిషాలకు మించి ప్రకటనలు ప్రసారం చేయకూడదన్న నిబంధనను సవాలు చేస్తూ న్యూస్ చానల్స్ సంఘం సవాలు చేసిన కేసు విచారణను ఢిల్లీ హై కోర్టు సెప్టెంబర్ 8 కి వాయిదా వేసింది. కేబుల్ టీవీ చట్టం లో పేర్కొన విధంగా అన్ని టీవీ చానల్స్  గంటకు 10 నిమిషాలవరకు వాణిజ్య ప్రకటనలు, 2 నిమిషాలపాటు సొంత కార్యక్రమాల ప్రచార ప్రకటనలు ప్రసారం చేసుకోవచ్చునని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీచేసింది. ఇది కొత్త నిబంధన కాదని, కేబుల్ చట్టంలో ఉన్నదే సక్రమంగా అమలు చేస్తున్నామని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( టాయ్ ) పేర్కొంది.

అయితే, న్యూస్ చానల్స్ సంఘమైన ఎన్ బి ఏ సహా మరికొన్ని చానల్స్ ఈ ఆదేశాలను సవాలు చేశాయి. ఎక్కువభాగం ఎంటర్టైన్మెంట్ చానల్స్ కు చందారూపంలో ఆదాయం వస్తుంది కాబట్టి ప్రకటనలమీద పరిమితి విధించినా పెద్దగా ఇబ్బంది ఉండదని, న్యూస్ చానల్స్ పరిస్థితి అందుకు భిన్నమని ఎన్ బి ఏ తన పిటిషన్ లో పేర్కొంది.  సన్ నెట్ వర్క్, ఈ టీవీ, రాజ్ టీవీ నెట్ వర్క్ , కలైంజ్ఞర్ లాంటి   కొన్ని ప్రాంతీయ చానల్స్ కూడా జాతీయ స్థాయి చానల్స్ కూ ప్రాంతీయ చానల్స్ కూ ఒకే  నిబంధన తగదని వాదిస్తూ ఈ  కేసు లో భాగస్వాములయ్యాయి. డిజిటైజేషన్ పూర్తి కాకముందే, ఆ ఫలితాలు అందకముందే ఈ పరిమితి విధించటం తగదని ట్రాయ్ కి విన్నవించాయి.

నిజానికి ఈ కేసు దాఖలైనప్పుడు జరిగిన వాదోపవాదాల సందర్భంగా కోర్టు కొన్ని సూచనలు చేసింది. చానల్స్ మీద బలవంతంగా చర్యలకు దిగవద్దని కోర్టు ట్రాయ్ కి సూచించింది. అదే సమయంలో చానల్స్ తాము ప్రసారం చేసిన ప్రకటనల పూర్తి వివరాలను

అయితే, ఢిల్లీ హైకోర్టు న్యాయవాదులు సమ్మె చేస్తున్నందున  ఈ కేసు విచారణను సెప్టెంబర్ 8 కి వాయిదా వేస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టు ప్రకటించింది. కోర్టు జ్యూరిస్ డిక్షన్ ను 20 లక్షల రూపాయలనుంచి 2 కోట్లకు పెంచటం పట్ల నిరసనతెలియజేస్తూ న్యాయవాదులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.