టాప్5 న్యూస్ చానల్స్ జాబితాలో 10టీవీ, స్థానం కోల్పోయిన ఎబిఎన్ ఆంధ్రజ్యోతి
ఈ ఏడాది ఐదోవారం ( జనవరి 26 నుంచి ఫిబ్రవరి 2 వరకు) తెలుగు న్యూస్ చానల్స్ మొదటి మూడు రాంకుల్లో తేడాలేదు. అయితే, కొద్దివారాలుగా నాలుగో స్థానంలో ఉన్న ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ సారి టాప్ 5 లేకపోవటం విశేషం. టీవీ9 గణనీయమైన పెరుగుదల నమోదు చేసుకోగా ఎన్టీవీ, 10టీవీ స్వల్పంగా పెరిగాయి.
ఎన్టీవీ తన రెండో రాంకును కాపాడుకుంది. టీవీ 5తగ్గినప్పటికీ మూడో స్థానంలోనే ఉండగా వి6 న్యూస్ కొంత తగ్గినా నాలుగో స్థానంలోకి ఎగబాకింది. 10 టీవీ కొద్దిపాటి పెరుగుదలతో టాప్5 తెలుగు న్యూస్ చానల్స్ జాబితాలో స్థానం సంపాదించుకోగలిగింది. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకాదరణ తగ్గటంతో టాప్ 5 లో స్థానం కోల్పోయింది.
రాంక్ | చానల్ | వారం వీక్షణలు (వేలల్లో) | |
తాజా వారం | |||
1 | టీవీ9 తెలుగు | 57415 | |
2 | ఎన్టీవీ తెలుగు | 43094 | |
3 | టీవీ 5 న్యూస్ | 32829 | |
4 | వి6 న్యూస్ | 31037 | |
5 | 10 టీవీ | 30774 |
Recent Comments