13 చానల్స్ కు షో కాజ్ నోటీసులు

పుల్వామా దాడికి సంబంధించి ఫిబ్రవరి 22న పాకిస్తాన్ సైనిక అధికార ప్రతినిధి మీడియా సమావేశాన్ని ప్రసారం చేయటం ద్వారా కార్యక్రమాల నియమావళిని, కేబుల్ టీవీ చట్టాన్నిఉల్లంఘించాయంటూ 13 చానల్స్ కు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ షో కాజ్ నోటీసు జారీచేసింది. వాటిలో ఇటీవలే ప్రారంభమైన కపిల్ సిబల్ చానల్ తిరంగా టీవీ కూడా ఉంది. జాతివ్యతిరేక వైఖరిని ప్రోత్సహించే ప్రసారాలు గాని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అంశాలు గాని ప్రసారం చేయకూడదన్న నిబంధనకు ఇది విరుద్ధమని ఆ నోటీసులో పేర్కొంది.

జమ్మూకాశ్మీర్ దాడుల నేపథ్యంలో ఈ నెల 14 న మంత్రిత్వశాఖ చానల్స్ కు ఒక హెచ్చరిక జారీచేస్తూకార్యక్రమాల నియమావళిని కచ్చితంగా పాటించాలని గుర్తు చేసింది. న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్, ఐండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ కూడా తమ సభ్య చానల్స్ కు ఈ విషయాన్ని తెలియజేశాయి.

ఈ ప్రసారం ద్వారా నిబంధనలను, ఈ హెచ్చరికను కూడా తుంగలో తొక్కాయంటూ మంత్రిత్వశాఖ నోటీసులు జారీచేసింది. ఇలా నోటీసులు అందుకున్న చానల్స్ లో తిరంగా టీవీ, ఎబిపి న్యూస్, సూర్య సమాచార్, జీ హిందుస్తాన్, టోటల్ టీవీ, ఎబిపి మజా, న్యూస్ 18 లోక్ మత్, జై మహారాష్ట, న్యూస్18 గుజరాత్, న్యూస్ 24, న్యూస్ నేషన్, సమ్దేశ్ న్యూస్, న్యూస్ 18 ఇండియా ఉన్నాయి. ఉల్లంఘనలకు పాల్పడినందుక చర్యలు ఎందుకు తీసుకోకూడదో వారంరోజుల్లోగా చెప్పాలంటూ ఆ నోటీసులో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!