• Home »
  • Broadband »
  • మూడు రోజుల ముంబై బ్రాడ్ కాస్ట్ ఇండియా షో ప్రారంభం

మూడు రోజుల ముంబై బ్రాడ్ కాస్ట్ ఇండియా షో ప్రారంభం

1991 మొదలుకొని ఏటా ముంబయ్ లో జరుగుతున్న బ్రాడ్ కాస్ట్ ఇండియా షో ఇప్పుడు 25వ సంవత్సరంలో అడుగుపెట్టి మూడు రోజుల ప్రదర్శన ప్రారంభించింది. ప్రపంచం నలుమూలలనుంచి 35 దేశాలకు చెందిన దాదాపు 550 కంపెనీలు ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను, సేవలను ప్రదర్శిస్తున్నాయి. నిరుడు 40 మంది మొదటిసారిగా భారత మార్కెట్లో ప్రవేశించటానికి ఈ ప్రదర్శనను వేదికగా మార్చుకోవటం విశేషం. వారిలో బ్రాడ్ కాస్ట్, ఫిల్మ్, మల్టీమీడియా రంగాలకు హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ అందించే వారున్నారు.

ఈ మూడు రోజుల ప్రదర్శనతోబాటు రెండురోజులపాటు సాంకేతికాంశాలమీద సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. వివిధ సంస్థలలో ఉన్నత పదవులలో ఉన్నవారు తమ అభిప్రాయాలను, అనుభవాలను పంచుకుంటారు. ఈ సదస్సుకు, ప్రదర్శనకు పరిశ్రమ లోని వివిధ వర్గాలవారు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. సాంకేతిక నిపుణులు, క్రియేటి హెడ్స్, మార్కెటింగ్ ప్రతినిధులు, కన్సల్టెంట్స్, విద్యార్థులు పాల్గొని సరికొత్త పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచుకుంటారు.