• Home »
  • Cable »
  • పే చానల్ చందాల పెంపు కేసు 21కి వాయిదా వేసిన సుప్రీం కోర్టు

పే చానల్ చందాల పెంపు కేసు 21కి వాయిదా వేసిన సుప్రీం కోర్టు

పే చానల్స్ తమ చందా రేట్లను 27.5% మేరకు పెంచుకోవటానికి ట్రాయ్ అనుమతించిన వ్యవహారంలో విచారణను ఈ నెల 21 కి వాయిదావేస్తునట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. జస్టిస్ ఎమ్ వై ఇక్బాల్, జస్టిస్ సి.నాగప్పన్ తో కూడిన బెంచ్ ఈ వ్యవహారంలో ప్రతివాదులైన సెంటర్ ఫర్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా, డిటిహెచ్ ఆపరేటర్లు,కేబుల్ ఆపరేటర్లకు నోటీసులు జారీచేశారు. ఈ నెల 21 లోగా సమాధానాలివ్వాలని కోరారు. ఈ లోపు చానల్స్ నుంచి డబ్బు వెనక్కి ఇవ్వాల్సిందిగా అడగవద్దని కూడా అనధికారికంగా ఎమ్మెస్వోలకు, డిటిహెచ్ ఆపరేటర్లకు చెప్పినట్టు తెలుస్తోంది. ప్రధాన పిటిషనర్అయిన ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్తకుముందే డిటిహెచ్ ఆపరేటర్లను కూడా ఇంప్లీడ్ కావాల్సిందిగా కోరింది.

పే చానల్స్ తమ చందాలు రెండు విడతలుగా 27.5% మేరకు పెంచుకోవచ్చునని ట్రాయ్ అనుమతించింది. పైగా, ఇకమీదట ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పెంచుకోవటానికి కూడా అవకాశమిచ్చింది.  అయితే, టిడిశాట్ మాత్రం ఈ ధోరణిని తప్పు పట్టింది. ట్రాయ్ ఆదేశాలను నిలువరించింది. స్టార్ ఇండియా, వయాకామ్ 18, సన్ టీవీ లాంటి పెద్ద గ్రూపులు దీన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. టిడిశాట్ ఆదేశాలు అమలుకాకుండా చూడాలంటూ సుప్రీంలో వాదించాయి. 2009 తరువాత చందా రేట్లు పెంచలేదని, అందువలన ఈ పెంపు సమంజసమేనని విన్నవించాయి.

హోమ్ కేబుల్ నెట్ వర్క్ సహా కేబుల్ ఆపరేటర్లు టిడిశాట్ లో సవాలు చేశారు. టారిఫ్ పెంచటం వెనుక ఎలాంటి హేతుబద్ధతాలేదని వాదించారు. డేటా అందుబాటులో లేదంటూ పే చానల్స్ కు మేలు చేసేల అవ్యవహరించటమేమిటమి ప్రశ్నించారు. టోకు ధరల సూచిని ఆధారంగా చేసుకొని కార్మికుల వేతనాలు పెంచవచ్చు తప్ప చానల్స్ ఖర్చులతో సంబంధం లేని టోకు ధరల సూచి ఆధారంగా పే చానల్ చందా పెంచటమేంటని ప్రశ్నించారు. దీంతో ట్రాయ్  ఉత్తర్వులను టిడిశాట్ పక్కన బెట్టింది. మొత్తంగా ఈ నెల 21 న ప్రతివాదులు ఇచ్చే సమాధానాన్ని బట్టి కేసు ముందుకు సాగుతుంది.