• Home »
  • Cable »
  • 24 నుంచి 3 రోజుల కేబుల్ ఎక్స్ పో

24 నుంచి 3 రోజుల కేబుల్ ఎక్స్ పో

కేబుల్ రంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆధునిక ధోరణులను పరిచయం చేస్తూ ఈ నెల 24 బుధవారం నాడు హైదరాబాద్‌ హైటెక్స్‌ లో కేబుల్ ఎక్స్‌ పో విజన్-2016 ప్రారంభమవుతోంది. ఈ ప్రదర్శనకు ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున తరలి రావాలని తెలంగాణ ఎమ్మెస్వోలు, ఆపరేటర్ల సమాఖ్య అధ్యక్షుడు ఎం. సుభాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఈ సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.

సి ఎన్ సి గ్రూప్ నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనను మంత్రి తారకరామారావు 24 ఉదయం 11 గంటలకు ప్రారంభిస్తారు. ఢిల్లీ, ముంబై తరహాలో మూడు రోజులపాటు సాగే ఈ ప్రదర్శనలో దేశవిదేశాలకు చెందిన సాంకేతిక పరిజ్ఞానానికి అద్దం పట్టే పరికరాలు ప్రదర్శించటానికి వీలుగా 250 స్టాల్స్ సిద్ధమవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది సహా 15 వేలమంది ఈ ప్రదర్శనకు తరలి వస్తారు.

ఎంఎస్‌వోలు మల్లేశ్, రాజేందర్, శ్యాంసుందర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్న ఈ మీడియా సమావేశంలో తెలంగాణలో అతిపెద్ద ఎమ్మెస్వో అయిన బ్రైట్ వే కమ్యూనికేషన్ స్టాల్ వివరాలను సుభాష్ రెడ్డి  వెల్లడించారు. అదే విధంగా ఆయన సారధ్యంలో నిర్వహిస్తున్న కేబుల్ సమాచార్ పత్రిక స్టాల్ గురించి, చందా ఆఫర్ గురించి చెప్పారు.