• Home »
  • Audience »
  • జాతీయ స్థాయి టాప్ 10 లో 3 తెలుగు చానల్స్

జాతీయ స్థాయి టాప్ 10 లో 3 తెలుగు చానల్స్

జాతీయ స్థాయిలో టాప్ 10 లో మొదటి స్థానం క్రమం తప్పకుండా సన్ టీవీ మాత్రమే సొంతం చేసుకుంటూ ఉంది. టాప్ 10 లో 1 లేదా 2 తెలుగు చానల్స్ ఉండటంచాలా సందర్భాలలో జరిగినప్పటికీ మొదటి సారిగా ఈ సంక్రాంతి వారంలో మూడు తెలుగు చానల్స్ స్థానం దక్కించుకున్నాయి.  స్టార్ మా, జెమిని టీవీ, ఈటీవీ టాప్ 10 లో ఉన్నాయి.

హిందీ అత్యధికంగా మాట్లాడే భాష అయినప్పటికీ ఎక్కువ సంఖ్యలో చానల్స్ ఉండటం వలన తమిళంలో సన్ టీవీ మొదటి స్థానం దక్కించుకుంది. కానీ సన్ టీవీకి తమిళనాట  తిరుగులేని నెంబర్ వన్ స్థానం ఉండటం వలన ఇది సాధ్యమైంది. దక్షిణాదిన మరే భాషలోనూ లేనంతగా తెలుగులో గట్టిపోటీ ఉండటం వలన నెంబర్ వన్ కాలేకపోవటం, అదే సమయంలో టాప్ టెన్ లో ఎక్కువ స్థానాలు సంపాదించుకోవటం కనిపిస్తుంది.

రాంకు         చానల్ వీక్షణలు ( వేలల్లో)
1 సన్ టీవీ       1147850
2 జీ అన్మోల్          738873
3 స్టార్ భారత్          697496
4 స్టార్ మా           649550
5 జీ టీవీ          643361
6 కలర్స్          642897
7 జెమిని టీవీ           642270
8 సోనీ పాల్          616602
9 స్టార్ ఉత్సవ్           553165
10     ఈటీవీ తెలుగు           513852