• Home »
  • BARC »
  • BARC రేటింగ్స్ లో చేరిన చానల్స్ 429: తెలుగు చానల్స్ సంఖ్య 39 మాత్రమే

BARC రేటింగ్స్ లో చేరిన చానల్స్ 429: తెలుగు చానల్స్ సంఖ్య 39 మాత్రమే

టీవీ ప్రేక్షకుల ఆదరణను కొలిచేందుకు పరిశ్రమలోని భాగస్వాములు స్వయంగా ఏర్పాటు చేసుకున్న బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) తన చందాదారుల సంఖ్యను 429 కి పెంచుకొగలిగింది. ప్రారంభమైన ఏడాదిలోపే ఈ ఘనత సాధించామని సంస్థ సీఈవో వెల్లడించారు. వివిధ భాషల్లో ఫీడ్ అందించే డిస్కవరీ, నేషనల్ జాగ్రఫీ, కార్టూన్ నెట్ వర్క్ లాంటి మరో 28 చానల్స్ కూడా కలుపుకుంటే ఈ సంఖ్య 457 అవుతుందని కూడా పేర్కొన్నారు.

బార్క్ వాటర్ మార్కింగ్ టెక్నాలజీ కోసం ఒప్పందాలు కుదుర్చుకున్న చానల్స్ లో 196 హిందీ మాట్లాడే ప్రాంతానికి ప్రసారాలు అందించేవి కాగా తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్నాటల రాష్ట్రాలతో కూడిన దక్షిణ భారతదేశానికి చెందిన చానల్స్ 131 ఉన్నాయి. అందులో తమిళనాడు, పాండిచ్చేరి కలిపి 42 చానల్స్ చందాదారులుగా చేరగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో కూడిన తెలుగు మార్కెట్ లో 30 చానల్స్  చందాదారులయ్యాయి. కర్నాటక 27,  కేరళ 23 చానల్స్ తో ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి.