4 మా టీవీ చానల్స్ లైసెన్సులు రద్దు

మా టెలివిజన్ నెట్ వర్క్ లిమిటెడ్ కు చెందిన నాలుగు చానల్స్ కు లైసెన్స్ రద్దయింది. సమాచార, ప్రసారమంత్రిత్వశాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించించి. తాజాగా ప్రకటించిన లైసెన్స్ పొందిన చానల్స్ జాబితానుంచి వీటిని తొలగించింది. సంస్థ డైరెక్టర్ మీద ఉన్న ఆర్థిక నేరాల అభియోగాల కారణంగా హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ నిరాకరించటంతో సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే మా టెలివిజన్ నెట్ వర్క్ లిమిటెడ్ నుంచి చానల్ వ్యాపారాన్ని మాత్రమే కొనుగోలు చేసి ఆ పేర్లను తమ కంపెనీ కిందికి మార్చుకొని లైసెన్సులు తీసుకున్న స్టార్ ఇండియా సంస్థ ప్రస్తుతం నడుపుకుంటున్న  నాలుగు మా టీవీ చానల్స్ కు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. స్టార్ ముందు చూపుతో మా టీవీ సంస్థను తీసుకోకుండా కేవలం వ్యాపారాన్ని మాత్రమే కొనుగోలు చేయటం వలన ఈ లైసెన్స్ రద్దు వ్యవహారంతో స్టార్ కు సంబంధం ఉండదు. మా టెలివిజన్ నెట్ వర్క్ లిమిటెడ్ అనే పాత కంపెనీ చానల్స్ కు మాత్రమే ఇది వర్తిస్తుంది.