40 ఫ్రీడిష్ స్లాట్స్ ఆదాయం 400 కోట్లు

ప్రసార భారతి వారి ఉచిత డిటిహెచ్ వేదిక డిడి ఫ్రీడిష్ తన 40 స్లాట్స్ వేలం వేయటం ద్వారా రూ. 394.49 కోట్లు సంపాదించింది. కొత్త విధానం ప్రకటించిన తరువాత వేసిన 38వ ఈ-వేలం ద్వారా సంపాదించిన ఈ మొత్తం గతంతో పోల్చినప్పుడు 30శాతం అధికం. అనేక పెద్ద పే చానల్స్  ఈ ప్లాట్ ఫామ్ నుంచి వైదొలగాలని నిర్ణయించినప్పటికీ ఈ ఆదాయం రాగా, అవి కూడ ఉంటే ఆ మొత్తం అనూహ్యంగా ఉండేదని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మొత్తం 40 ఎంపెగ్2 స్లాట్స్ వేలం వేయగా అన్ని విభాగాలలోనూ గట్టి పోటీ కనబడింది.  ప్రధాన చానల్స్ విషయంలో తప్పుకున్నప్పటికీ స్టార్ ఇండియా, సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్, వయాకామ్ 18 లాంటి సంస్థలు కూడా కొన్ని స్లాట్స్ తీసుకున్నాయి. మొత్తం మీద గత వేలం కంటే 30 శాతం ఆదాయం పెరిగినట్టి ప్రసార భరతి సీఈవో శశి శేఖర్ వెంపటి చెప్పారు. మరాఠీ చానల్ సహా 8 కొత్త చానల్స్ ఈసారి ఈ వేదికమీదికి వచ్చాయి.

మొదటి విభాగంలో జీ గ్రూప్ వారి బిగ్ గంగా, దంగల్ ఉన్నాయి.  కనీస ధర రూ. 15 కోట్లు కాగా గరిష్ఠ ధర రూ. 15 కోట్ల 5 లక్షలు పలికింది. రెండో విభాగంలో కనీస ధర 12 కోట్లు కాగా సగటున రూ, 12.4 కోట్లు వచ్చింది. మూడో విభాగంలో కనీస ధర రూ.10 కోట్లు కాగా సగటున రూ.10.6 కోట్లు లభించింది. మిగతా లాంఛనాలన్నీ పూర్తయితే మార్చి 1 నుంచి ఈ చానల్స్ అన్నీ డిడి ఫ్రీడిష్ లో ప్రసారమవుతాయి. ఇప్పటివరకు తాత్కాలికంగా దామాషా పద్ధతిలో కొనసాగుతున్నచానల్స్ ఆగిపోతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!