• Home »
  • Cable »
  • దేశంలోని డిటిహెచ్ కనెక్షన్లలో సగం వాడకంలో లేవు

దేశంలోని డిటిహెచ్ కనెక్షన్లలో సగం వాడకంలో లేవు

దేశంలో డిటిహెచ్ వాడకందారుల సంఖ్య పడిపోతున్నట్టు టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సమాచారం తెలియజేస్తోంది. కొత్త కనెక్షన్లు వస్తునట్టు డిటిహెచ్ ఆపరేటర్లు ఎప్పటికప్పుడు చెబుతున్నప్పటికీ పాత వాడకందారులు తమ కనెక్షన్లను పక్కనబెట్టిన సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో 45.89% కనెక్షన్లు వాడకంలో లేనివిగా తాజాగా ట్రాయ్ నిర్థారించింది.

మొత్తం ఆరుగురు డిటిహెచ్ ఆపరేటర్లు డిష్ టీవీ, టాటా స్కై, ఎయిర్ టెల్, రిలయెన్స్, వీడియోకాన్, సన్ డైరెక్ట్ ఉండగా ప్రసార భారతి ఆధ్వర్యంలో డిడి ఫ్రీడిష్ నడుస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో నమోదు చేసుకున్న మొత్తం చందాదారులు 7 కోట్ల 60 లక్షల 50 వేలు ఉండగా అందులో 4 కోట్ల 5 లక్షల 40 వేల మంది మాత్రమే ప్రస్తుతం సేవలు అందుకుంటున్న చందాదారులు. అంటే, 45.89% మంది చందాదారులుగా నమోదైనప్పటికీ ప్రస్తుతం వీటి సేవలు వాడుకోవటం లేదు. పాత చందాదారులు సగటున 7 శాతం చొప్పున తగ్గుతూ వస్తున్నట్టు కూడా ట్రాయ్ లెక్కలు చెబుతున్నాయి.