• Home »
  • Broadcasting »
  • త్వరలో భారత్ లో 4కె చానల్ ‘ హై టీవీ ’

త్వరలో భారత్ లో 4కె చానల్ ‘ హై టీవీ ’

న్యూ యార్క్ కేంద్రంగా ఉన్న అంతర్జాతీయ అల్ట్రా హెచ్ డి ఎంటర్టైన్మెంట్ చానల్ హై టీవీ 4కె ప్రసారాలు త్వరలో భారతదేశంలో అందబోతున్నాయి. దక్షిణాఫ్రికా కేంద్రంగా పనిచేసే స్ప్లెండిడ్ మీడియా వారి గుర్గాం ఆఫీసు ద్వారా భారత్ లో పంపిణీ జరుగుతుందని తెలుస్తోంది. ట్రావెల్, ఎంటర్టైన్మెంట్, లైఫ్ స్టైల్, స్పోర్ట్స్ కార్యక్రమాల మిశ్రమం అందించటంతోబాటు వీడియో ఆన్ డిమాండ్ విభాగంలో ఇప్పటికే 250 గంటల 4కె వీడియో సిద్ధం చేసినట్టి చెబుతున్నారు.

ఇంతకు ముందు నెదర్లాండ్స్ కు చెందిన టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ రియాలిటీ నెట్ వర్క్ (TERN) కార్తికేయశర్మకు చెందిన ఐటీవీ నెట్ వర్క్ తో కలిసి ఇన్ సైట్ అనే 4కె చానల్ ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి టాటా స్కై, వీడియోకాన్ డి2హెచ్ అనే రెండు డిటిహెచ్ సంస్థలు మాత్రమే 4కె సర్వీస్ అందిస్తున్నాయి.