• Home »
  • Entertainment »
  • కేటాయింపులకంటే తక్కువ ఖర్చు చేసిన 5 డిడి చానల్స్

కేటాయింపులకంటే తక్కువ ఖర్చు చేసిన 5 డిడి చానల్స్

2014-15 ఆర్థిక సంవత్సరానికి  డిడి నేషనల్ కు  బడ్జెట్ లో కేటాయించిన రూ. 140 కోట్లకు గాను రూ.133 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్టు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ తెలియజేసింది.  2012 నుంచి ఇదే పద్ధతి సాగుతున్నట్టు కూడా పేర్కొంది. డిడి స్పోర్ట్స్ కి 2013-14లో 13.83 కోట్లు కేటాయించగా రూ.9.92 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది. 2014-15 లో 38.31 కోట్లు కేటాయించగా అందులో 36.53 కోట్లు ఖర్చు చేసింది.

ఉర్దూ చానల్ విషయానికొస్తే గడిచిన ఆర్థిక సంవత్సరానికి రూ. 17 కోట్ల 11 లక్షలు కేటాయిస్తే, కేవలం రూ. 11 కోట్ల 23 లక్షలే ఖర్చు చేసింది. డిడి భారతి, డిడి ఇండియా కూదా ఇదే విధంగా కేటాయింపుల కంటే తక్కువ ఖర్చు చేస్తూ వస్తున్నాయి. వృత్తిపరమైన, ప్రత్యేఅ సేవలకు చెల్లింపులు అనే పద్దుకింద దూరదర్శన్ బాగా తక్కువ ఖర్చు చేస్తున్నట్టు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెల్లడించింది.