నిబంధనలు ఉల్లంఘించిన చానల్స్ 54

గడిచిన నాలుగేళ్లలో ప్రసారాలపరంగా నియమాల ఉల్లంఘనలకు పాల్పడిన చానల్స్ 54 ఉన్నట్టు సమాచార, ప్రసార శాఖామంత్రి స్మృతి ఇరానీ లోక్ సభకు తెలియజేశారు. అందులో 2014, 2015 సంవత్సరాలలో  17 చానల్స్ చొప్పున నియమావళిని ఉల్లంఘించగా 2016 లో 16 చానల్స్, 2017 లో 4 చానల్స్  ఆ జాబితాలో చేరాయన్నారు. కేబుల్ టీవీ చట్టం ప్రకారం ఈ నియమాలు పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేశారు.

అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ మార్గదర్శక సూత్రాల ప్రకారం అలా నియమావళిని  ఉల్లంఘించిన చానల్స్ మీద చర్యలు తీసుకున్నట్టు కూడా మంత్రి వెల్లడించారు. మొత్తం 54 చానల్స్ మీద చర్యలు తీసుకోగా అనేక చానల్స్ కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్న విషయం కూడా మంత్రి ప్రస్తావన తెచ్చారు. ఏమైనప్పటికీ ఈ జాబితాలోఅనేక తెలుగు చానల్స్ కూడా ఉన్నాయి.

2014 లో టీవీ 5, 2016 లో ఎన్టీవీ, టీవీ9, 2016 లో సివిఆర్ ఇంగ్లిష్ న్యూస్ అలా నియమాలు ఉల్లంఘించినట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది. కొంతమందికి షో కాజ్ నోటీసులతో సరిపెట్టి మరికొందరికి ఒకరోజు ప్రసారాల నిలిపివేతకు ఆదేశాలివ్వగా ఆ చానల్స్ కోర్టులో స్టే తెచ్చుకున్న విషయాన్ని కూడా మంత్రి తెలియజేశారు.