• Home »
  • Broadband »
  • ఆగస్టు 17-19 తేదీల్లో 3 రోజులపాటు కేబుల్ నెట్ ఎక్స్ పో విజన్ 2018: రాము

ఆగస్టు 17-19 తేదీల్లో 3 రోజులపాటు కేబుల్ నెట్ ఎక్స్ పో విజన్ 2018: రాము

సి ఎన్ సి గ్రూప్ ఆధ్వర్యంలో నడిచే 7వ కేబిల్ నెట్ ఎక్స్ పో విజన్ 2018  కు రంగం సిద్ధమవుతోంది. ఈ సారి కూడా హైటెక్స్ ఆవరణలోని ఎగ్జిబిషన్ హాల్ లోనే ఈ ప్రదర్శన ఏర్పాటవుతుండగా అనేక సంస్థలు డిజిటల్ కేబుల్ టీవీ, బ్రాడ్ బాండ్ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఉత్పత్తులు, సాఫ్ట్ వేర్ ప్రదర్శించటానికి సిద్ధమవుతున్నాయని సి ఎన్ సి గ్రూప్ అధిపతి, ఎక్స్ పో నిర్వాహకుడు రాము చెబుతున్నారు.

ఆగస్టు 17,18,19 తేదీలలో మూడు రోజులపాటు సాగే ఈ ప్రదర్శనలో పాల్గొనదలచిన సంస్థలకు స్థలం కేటాయించే విషయంమీద ఇప్పటినుంచే సమాలోచనలు సాగుతున్నాయి. గత ప్రదర్శన సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులకు ప్రోత్సాహం లభించటంతో ఈ సారి కూడా టెక్నికల్ సదస్సులు జరిగే అవకాశముంది. ఏదవ విడత జరుగుతున్న ఈ ప్రదర్శనకు వచ్చే వారి సంఖ్య పెరుగుతూ ఉండటం ప్రోత్సాహకరంగా మారిందని నిర్వాహకుడు రాము తెలియజేశారు.