• Home »
  • Data & Projections »
  • కేంద్ర సమాచారశాఖ ఖర్చులో 80 శాతం బ్రాడ్ కాస్ట్ రంగానిదే

కేంద్ర సమాచారశాఖ ఖర్చులో 80 శాతం బ్రాడ్ కాస్ట్ రంగానిదే

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఖర్చులో 80 శాతం మేరకు బ్రాడ్ కాస్ట్ రంగానికే ఖర్చవుతున్నట్టు ఇటీవలి ఆడిట్ నివేదికలు వెల్లడించాయి.  అంటే  దూరదర్శన్, ఆకాశవాణి కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్టు  అందులో పేర్కొన్నారు. మిగిలిన 20 శాతం లో  సచివాలయం, చలనచిత్ర రంగం, సమాచార విభాగాలమీద ఖర్చుచేస్తున్నారు.

2015 మార్చి తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి  దాదాపు 2500 కోట్ల రూపాయలు ఖర్చు చేయగా అందులో సమాచార విభాగానికి రూ.466 కోట్లు, చిత్ర రంగానికి 48 కోట్లు మాత్రమే ఖర్చయింది. మిగిలిన 1986 కోట్ల రూపాయలు బ్రాడ్ కాస్ట్ రంగం మీదనే వెచ్చించారు.

అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2013-14 లో సమాచార విభాగం కోసం 475 కోట్లు, చలనచిత్ర రంగానికి 42 కోట్లు ఖర్చు కాగా బ్రాడ్ కాస్ట్ రంగానికి రూ. 2157 కోట్లు ఖర్చయింది. అంటే మొత్తం ఖర్చు 2474 కోట్ల రూపాయలలో 80 శాతానికి పైగా బ్రాడ్ కాస్ట్ రంగానికే ఖర్చయినట్టు ఆడిట్ నివేదిక తేల్చింది