99% చానల్ లో 3 గంటల మెరుపు సమ్మె

సిపిఐ వారి చానల్ 99% సిబ్బంది జీతాల బకాయిల కోసం ఈ సాయంత్రం సుమారు 3 గంటలపాటు సమ్మె చేశారు. నాలుగు నెలలపాటు జీతాల బకాయి ఉండటంతో పని నిలిపి వేసి వారు మెరుపు సమ్మెకు దిగారు. యాజమాన్య ప్రతినిధులు ఇచ్చిన సమాధానంతో సంతృప్తిచెందను ఉద్యోగులు సమ్మె కొనసాగించారు.

రెండు రోజుల్లో రెందు నెలల బకాయిలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించటంతో సిబ్బంది విధుల్లోకి చేరారు. సాయంత్రం 6 గంటలకు ప్రత్యక్షప్రసారాల పునరుద్ధరణ జరిగింది. సిపిఐ నాయకుడు నారాయణ ఇచ్చిన హామీతో ఉద్యోగులు తాత్కాలికంగా శాంతించారు.