• Home »
  • National Channels »
  • ఇండియా టీవీ ని మించి పోయి మళ్ళీ నెం.1 స్థానం లోకి దూసుకొచ్చిన ఆజ్ తక్

ఇండియా టీవీ ని మించి పోయి మళ్ళీ నెం.1 స్థానం లోకి దూసుకొచ్చిన ఆజ్ తక్

ఆజ్ తక్ తన చిరకాల ప్రత్యర్థి అయిన ఇండియా టీవీని వెనక్కి నెట్టి తన మొదటి స్థానాన్ని మళ్ళీ దక్కించుకుంది. 39 వ వారానికి టామ్ అందించిన ప్రేక్షకాదరణ సమాచారం ప్రకారం ఇండియా టీవీ తాజా లెక్కల్లో మూడో స్థానానికి వెళ్ళిపోయింది. జీ న్యూస్ రెండో స్థానంలోకి వచ్చింది.

ఇంగ్లీష్ న్యూస్ చానల్స్ విషయానికొస్తే, ఎన్డీటీవీ 24X7 మళ్ళీ రెండో స్థానానికొచ్చింది. టైమ్స్ నౌ తన తిరుగులేని నెంబర్ వన్ స్థానాన్ని కొనసాగించగా ఇండియా టుడే టీవీ వెనక్కి తగ్గింది, సిఎన్ ఎస్ ఐబిఎన్ తన మూడో స్థానం కాపాడుకుంది.

ఇంగ్లీష్ బిజినెస్ న్యూస్ చానల్స్ లో ఇటి నౌ వరుసగా మూడో వారం కూడా తన మొదటి స్థానాన్ని కాపాడుకోగలిగింది. దాని ప్రత్యర్థి అయిన సి ఎన్ బి సి టీవీ 18 రెండో స్థానంలోనూ, ఎన్డీటీవీ ప్రాఫిట్ మూడో స్థానంలోనూ రాంకులు మాత్రం యథాతథంగా కొనసాగించాయి.

హిందీ బిజినెస్ న్యూస్ చానల్స్ లో జీ బిజినెస్ తన సమీప ప్రత్యర్థి సి ఎన్ బి సి ఆవాజ్ మీద కొద్దిపాటి తేడాలో నెంబర్ వన్ స్థానం దక్కించుకుంది. ఎన్డీటీవీ ప్రాఫిట్, ఎన్డీటీవీ ప్రైమ్ చాలా దిగువన మూడో స్థానంతో సరిపెట్టుకుంది.