• Home »
  • Legal Issues »
  • డిడి కి రూ.150 కోట్లకు పైగా బకాయిపడ్డ యాడ్ ఏజెన్సీలు, ప్రభుత్వ సంస్థలు

డిడి కి రూ.150 కోట్లకు పైగా బకాయిపడ్డ యాడ్ ఏజెన్సీలు, ప్రభుత్వ సంస్థలు

దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ యాడ్ ఏజెన్సీలు, ప్రభుత్వ సంస్థలు దూరదర్శన్ కు రూ. 151 కోట్ల 93 లక్షల మేరకు బకాయిపడినట్టు సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పార్లమెంటుకు తెలియజేశారు. ఈ ఏడాది జనవరి 31 వరకు వడ్డీతో సహా ఈ బకాయిలు లెక్కగట్టినట్టు వెల్లడించారు. మొత్తం బకాయిదారుల సంఖ్య 623 ఉన్నట్టు పేర్కొంటూ ఆ జాబితాను కూడా విడుదలచేశారు.

వీటిలో 83 ఏజెన్సీలమీద కేసులు పెట్టినట్టు చెప్పారు. వాటినుంచి దాదాపు రూ.270 కోట్లు అసలు, రూ. 309 కోట్ల వడ్డీ వసూలు కావాల్సి ఉందన్నారు. బకాయిలలో అత్యధిక భాగం 25 ఏజెన్సీల నుంచే రావాల్సి ఉందని కూడా చెప్పారు. వీటినుంచి 173 కోట్ల రూపాయల అసలు, మరో 168 కోట్ల రూపాయల వడ్డీ వసూలు కావాల్సి ఉంది. మరికొందరు కోర్టు వెలుపల సెటిల్ చేసుకోవటానికి సుముఖంగా ఉన్నట్టు మంత్రి చెప్పారు.

.