• Home »
  • Cable »
  • ఎయిర్ టెల్ స్వదేశీ సెట్ టాప్ బాక్సుల విడుదల

ఎయిర్ టెల్ స్వదేశీ సెట్ టాప్ బాక్సుల విడుదల

ఎయిర్ టెల్ డిజిటల్ టీవీ  స్వదేశీ సెట్ టాప్ బాక్సులను మార్కెట్లోకి విడుదల చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పూణెలోని కర్మాగారంలో తయారైన ఎ హెచ్ డి సెట్ టాప్ బాక్సులను సమాచార, ప్రసారాల శాఖ  సహాయమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లాంఛనంగా  ఆవిష్కరించారు. ప్రభుత్వం తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని అందిపుచ్చుకొని  సెట్ టాప్ బాక్స్ తయరుచేసిన ఎయిర్ టెల్ ను, భారతీ ఎయిర్ టెల్ డిటిహెచ్ అండ్ మీడియా సీఈవో శశి అరోరాను మంత్రి అభినందించారు.

దిగుమతులను తగ్గించటం, ఉపాధి కల్పించటంతో బాటు తకువ ధరక్లు అందించటం ద్వారా వినియోగదారులకు మేలు చేయగలుగుతున్నామని ఎయిర్ టెల్ ప్రకటించింది. హీరో ఎలక్ట్రానిక్స్ వారి మై బాక్స్ టెక్  డిజైన్ సాయంతోనూ ఐడి లు, సెమికండక్టర్లు తయారుచేసే ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్ సాయంతోనూ ఈ సెట్ టాప్ బాక్సులు తయారయ్యాయి. ఫుల్ హెచ్ డి, ఎంపెగ్-4 వీడియో, డాల్బీ డిజిటల్ ప్లస్ సౌండ్, యుఎస్ బి సాయంతో అపరిమితంగా   రికార్డ్ చేసుకునే సౌకర్యం ఇందులో ఉంటాయి.  అదేవిధంగా ఎనీ టైమ్ టీవీ, ఇంటరాక్టివ్ గేమింగ్ లాంటి సౌకర్యాలు కూడా ఉంటాయని ఎయిర్ టెల్ డిజిటల్ పేర్కొంది.