• Home »
  • National Channels »
  • ప్రో కబడ్డీ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్

ప్రో కబడ్డీ లీగ్ బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్

స్టార్ స్పోర్ట్స్ వారి ప్రో కబడ్డీ లీగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉండగా దక్షిణాదిన మరింతగా ఆకట్టుకోవటంలో భాగంగా స్టార్ గ్రూప్ సినీ నటుడు అల్లు అర్జున్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రచార కర్తగా కబడ్డీ పట్ల క్రేజ్ పెంచుతాడని స్టార్ భావిస్తోంది. ఆగస్టు 4-7 మధ్య హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం ఎనిమిది లీగ్ మ్యాచ్ లు జరగబోతున్న సమయంలో స్టార్ ఈ నిర్ణయం తీసుకుంది.

భారతీయ క్రీడను ఈ తరానికి అందించటానికి గర్విస్తున్నామని, యువతను బాగా అకట్టుకోవటానికే అల్లు అర్జున్ ను ఎంచుకున్నామని స్టార్ స్పోర్ట్స్ హెడ్ నితిన్ కుక్రేజా చెప్పారు. ఇది ఈ ప్రాంతంలో కబడ్డీ పట్ల మరింత క్రేజ్ పెంచుతుందని భావిస్తున్నామన్నారు.

లీగ్ పోటీల సందర్భంగా ప్రతిరోజూ ప్రముఖులు జాతీయ గీతం ఆలపించటం గర్వంగా ఉందని, అమితాబ్ బచ్చన్, సునిధి చౌహాన్, సౌరవ్ గంగూలీ లాంటి వారు ఇందులో ఉన్నారని, హైదరాబాద్ లో తొలి రోజు ఆగస్టు 4న  అల్లు అర్జున్ జాతీయ గీతం ఆలపిస్తారని చెప్పారు.  స్టార్ స్పోర్ట్స్  ప్రో కబడ్డీ లీగ్ ద్వారా భారతీయ క్రీడకు మరింతప్రాధాన్యం పెరుగుతోందని, హైదరాబాద్ పోటీల సందర్భంగా జాతీయ గీతం ఆలపించటం  గర్వంగా ఉందని అల్లు అర్జున్ చెప్పారు.

ప్రస్తుతం ఈ పోటీలు తెలుగులో మా మూవీస్ లో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.