ఎ మాప్

aMap

భారతదేశంలో టెలివిజన్ రేటింగ్స్ లెక్కింపులో TAM ఒక్కటే గుత్తాధిపత్యం సాగిస్తుండగా ఒక ప్రత్యామ్నాయ సంస్థగా aMap ఏర్పడింది. ముంబయ్ కేంద్రంగా 2004 లో ఏర్పాటైన ఈ సంస్థ అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్నానాన్ని వినియోగించుకుంటూ చందాదారులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.  TAM  వారానికొకసారి రేటింగ్స్ నివేదిక ఇస్తుండగా ఇది మరుసటిరోజుకే ఇవ్వగలగటం ఒక ప్రత్యేకత. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రకటనకర్తలకు అవసరమైన సమాచారాన్ని తెల్లవారేసరికల్లా అందించటం, చానల్స్ తమ వ్యూహాలను ఎప్పటికప్పుడు బేరీజువేసుకునేలా విశ్లేషణాత్మక నివేదికలివ్వటం తమకు మాత్రమే సాధ్యమని aMap చెబుతుంది.
నిన్నటి ప్రసారాలు ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో తెలుసుకోవాలన్నా, వివిధ వయోవర్గాల అభిరుచులు పరిశీలించాలన్నా, కోల్పోయిన వ్యాపార అవకాశాన్ని గుర్తించి వెంటనే సవరించుకోవాలన్నా, చానల్ పంపిణీ వ్యవస్థను నిశితంగా గమనించాలన్నా aMap ను మించిన సర్వే పద్ధతిలేదని ఈ సంస్థ ప్రకటించుకుంటోంది. ప్రేక్షకుల మనోభావాలను  స్పష్టంగా అంచనావేసేందుకు వీలుగా TAM కంటే విస్తృతమైన శాంపిల్ తో సర్వే చేస్తోంది. దేశ వ్యాప్తంగా లక్ష జనాభా పైబడిన పట్టణాలన్నిటినీ తన పరిధిలోనికి తీసుకోవటంతో బాటు TAM వదిలేసిన జమ్మూ, గువాహతి, బీహార్, ఝార్ఖండ్ లాంటి ప్రాంతాల్లో కూడా aMap సర్వే చేస్తోంది.

శాంపిల్ ఎంపిక విధానం

శాంపిల్ ఎంపిక కోసం జరిపే ప్రాధమిక పరిశీలనను Establishment Survey  అంటారు. ఒక ప్రాంత ప్రజలలో ఎన్ని వయోవర్గాలు, ఆర్థిక సామాజిక తరగతులు, అలవాట్లు, ఆచారాలు ఉన్నాయో నిశితంగా పరిశీలీంచి, ఆయా వర్గాలకు తగిన విధంగా ప్రాతినిధ్యం లభించేలా శాంపిల్ ఎంపిక చేయాల్సి ఉంటుంది. అందుకే aMap ఈ ఫీల్డ్‍వర్క్ లో కనీసం 50 శాతం పనిని మళ్ళీ తనిఖీ చేస్తుంది. ముంబయ్ లాంటి నగరంలో వెయ్యి క్లస్టర్లు ఎంపిక చేసి వాటినుండి 10 వేలమందిని ఇంటర్వ్యూ చేసి శాంపిల్ నిర్ణయిస్తారు. ఒక్కో క్లస్టర్ నాయకుని ఎంపిక చేసేందుకు వోటర్ల జాబితాను ఆధారంగా తీసుకుంటారు. ఆతరువాత దశలో కొన్ని ప్రత్యేకాంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సామాజిక ఆర్థిక వర్గం, శాటిలైట్ ప్రసారాలా, టెరెస్ట్రియల్ ప్రసారాలా, వయసు, స్త్రీయా, పురుషుడా అనే ప్రాథమిక అంశాలతోబాటు కుటుంబ పరిమాణం, ఇంట్లో మాట్లాడే భాష,  రంగుల టీవీనా, బ్లాక్ అండ్ వైట్ టీవీనా, రిమోట్ ఉందా అనే అంశాలు కూడా పరిశీలించిన మీదటే శాంపిల్ ఖరారవుతుంది. ఆ తరువాత పానెల్ నిర్మాణం జరుగుతుంది. ఈ గ్రూపుల పరిమాణాన్ని ప్రతిబింబించే సంఖ్యలో పానెల్ ఉండేలా చూస్తారు.

డేటా సేకరణ

ఎంపిక చేసిన శాంపిల్ ఇళ్లలో మీటర్లు ఏర్పాటుచేస్తారు. ప్రతి మీటర్ ఒక GSM మోడెమ్ తో అనుసంధానమై ఉంటుంది. ఏదైనా కారణం వలన ఒక మీటర్ నుంచి డేటా తీసుకోవటం  ఒక సారి విఫలమైనా, మొత్తం మూడుసార్లు ప్రయత్నించే వీలుండటం వలన మిస్సయ్యే అవకాశాలు దాదాపు శూన్యమనే చెప్పాలి.  పానెల్  ఇళ్లలో 20 శాతం ఇళ్లు ఏటా రొటేషన్ పద్ధతిలో మారేలా జాగ్రత్తలు తీసుకుంటారు. Swiss Broadcasting Corporation సంస్థ వారి Telecontrol VIII వాడుకునేందుకు ప్రత్యేకంగా లైసెన్స్ పొందిన aMap సంస్థ ఈ  సరికొత్త టెక్నాలజీ సాయంతో GSM మోడెమ్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తుంది.  ప్రతి శాంపిల్ ఇంటిలోని టీవీ రిసీవర్ తో టెలికంట్రోల్  యూనిట్ అనుసంధానం అవుతుంది. ఆ సమయంలో టీవీలో ఏ కార్యక్రమం వస్తున్నదో ఆ సమాచారం ఆటోమేటిక్ గా  టెలికంట్రోల్ యూనిట్ లో నమోదవుతుంది. ఇందులో వారంరోజుల సమాచారం నిల్వ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ప్రతి టెలికంట్రోల్ యూనిట్ ఒక GSM మోడెమ్ తో అనుసంధానమవుతుంది. సెంట్రల్ సర్వర్ ప్రతి టెలికంట్రోల్ యూనిట్ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటూ ఉంటుంది. ఏదైనా ఒక కార్యక్రమం మీద అప్పటికప్పుడు అభిప్రాయం తెలుసుకోవాలన్నా ఇందులో సాధ్యమే. ఇలా సేకరించిన సమాచారాన్ని వెనువెంటనే ఒక నివేదికగా రూపొందించే వెసులుబాటు ఉంటుంది. అంటే, ఒక చానల్ ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేస్తూ, దాన్ని ఎంతమంది చూస్తున్నారో అప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. పోటీ చానల్ వివరాలు కూడా తెలుసుకోవచ్చు. అవసరమనుకుంటే కార్యక్రమంలో తగిన మార్పులు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది.

aMapసర్వే లో ప్రతి రోజూ తెల్లవారు జామున 2 గంటలనుండి మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటలవరకు ఒక రోజుగా లెక్కిస్తారు. డేటా ను తీసుకోవటానికి సెంట్రల్ సర్వర్ రోజుకు మూడుసార్లు కాల్ చేస్తుంది. ఉదయం 2 నుండి 4 గంటల మధ్య ఒకసారి, ఏదైనా కారణం వలన కుదరకపోతే, ఐదు నిమిషాలు ఆగి మళ్ళీ కాల్ చేస్తుంది. అప్పుడు కూడా కుదరకపోతే గంటన్నర తరువాత ప్రయత్నిస్తుంది.  ఈ మూడు ప్రయత్నాలోనూ కుదరనంత మాత్రాన ఆ ఇంటి సమాచారాన్ని వదిలేసినట్టు కాదు.  ఆ తరువాత వారం రోజులవరకు నిల్వ ఉంటుంది కాబట్టి ఈ లోపు తీసుకోవచ్చు. ఏయే ఇళ్లలో సమాచారం తీసుకోలేకపోయిందీ ఒక జాబితా దానంతట అదే అందిస్తుంది. వైఫల్యానికి కారణమేమిటో అదే రోజు తెలుసుకుంటారు. టెలికంట్రోల్ యూనిట్ డిస్‍కనెక్ట్ కావటం గాని, విద్యుత్ సరఫరా నిలిచిపోవటం గాని, ఆ శాంపిల్ ఇల్లు తాళం వేసి ఉండటం గాని, సెల్ కనెక్షన్ లో లోపం గాని వైఫల్యానికి కారణాలు కావచ్చు.

గడిచిన 24 సంవత్సరాలుగా జరుగుతున్న పరిశోధనలతో రాటుదేలిన టెలికంట్రోల్ సిస్టమ్ చాలా దేశాల్లో వినియోగంలో ఉంది. ఆస్ట్రియా, ఫ్రాన్స్, జర్మనీ, మెక్సికో, పోర్చుగల్, ప్యూర్టో రికో, స్విట్జర్లాండ్, స్పెయిన్, ఉక్రెయిన్, యు.ఎస్.ఎ ఈ విధానంలో టీవీ ప్రేక్షకుల వీక్షణను లెక్కిస్తున్నాయి. TAM  మీటర్ కు సగటున లక్ష రూపాయలు ఖర్చవుతుంటే, అందులో సగం ఖర్చుతో aMap పూర్తిచేయగలుగుతోంది. TAM  వారానికొకసారి ఇస్తుంటే, aMap మరుసటిరోజే ఫలితాలు అందజేస్తుంది.

రేటింగ్స్ లో వ్యక్తుల అభిప్రాయాలను మాత్రమే లెక్కలోకి తీసుకోవటం చూస్తున్నాం. అయితే, చాలా సందర్భాలలో, ముఖ్యంగా ప్రైమ్ ‍టైమ్  లో కుటుంబ సభ్యులందరూ టీవీ చూసే అవకాశం ఉంటుంది గనుక వారి అభిప్రాయాలను ప్రభావితం చేసే ప్రకటనలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అందుకే ఇలాంటి బృంద వీక్షణాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాలనేది aMap ఉద్దేశం. ప్రకటనదారుల కోణంనుంచి ఆలోచిస్తే ఈ వాదనకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. పత్రికల రీడర్‍షిప్ సర్వేలు కూడా టీ షాపులు, లైబ్రరీలు, సెలూన్ల వంటి ప్రదేశాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడ ఎంతమంది పాఠకులున్నారో అంచనా వేస్తుంది. అదేవిధంగా లెక్కించాలన్న ధ్యేయంతో aMap టెలివిజన్ ప్రేక్షకులను మరింత బాగా అర్థం చేసుకుంటోంది.

లెక్కింపు విధానం :

Total Time Spent by All Individuals on a particular Day part / Program  X 100

R%       =   ———————————————————————————————

Total Time of That Program or Daypart  X  Universe
Ratings 000s of a Channel

Market Share   =    ——————————————

                                     Ratings 000s of All Channels

 

Total Time Spent by All Individuals in the TG on a Particular Daypart

Usage in Mins.    =   —————————————————————–

Total no. of Individuals in the TG

 

Total Time Spent by All Individuals in the TG on a Particular Daypart

Usage Per Viewer =        —————————————————————-

                                                                        Actual No. of Viewers in the TG
Ratings 000s for a Selected Channel*100

Channel Share ( Rating )   =    ——————————————————–

Total Ratings 000s for All Selected Channels

 

                                                                Net Reach 000s for a selected channel * 100

Channel Share ( Audience )  =     ————————————-

Total Unduplicated Reach 000s foe All Selected Channels

 

aMaచందాదారులు ప్రతిరోజూ ఉదయాన్నే అంతకు ముందురోజు చానల్ పరిస్థితి తెలుసుకోవచ్చు. ప్రసారమైన ప్రతి అంశాన్నిపరిశీలించే అవకాశం ఉండటంతో వాటిని కార్యక్రమాలు, సొంత ప్రకటనలు, వాణిజ్య ప్రకటనలు అనే మూడు విభాగాలుగా చూపుతుంది. ఆ కార్యక్రమం రికార్డు చేసినదా, ప్రత్యక్షప్రసారమా, దాని ప్రారంభ, ముగింపు సమయాలు పేర్కొంటూ లాగ్ షీట్ రూపొందిస్తుంది. చందాదారులు మాత్రమే డౌన్‍లోడ్ చేసుకోగలిగే విధంగా ఏర్పాటు ఉంటుంది. ContentAnalyzer పేరుతో aMap స్వయంగా తయారుచేసుకున్న సాఫ్ట్ వేర్ సాయంతో MS Access డేటాబేస్ ఉపయోగించుకుంటూ విశ్లేషించుకునే వీలుంది. చానల్ యజమానులు కోరుకున్న కోణంలో సమాచారాన్ని విశ్లేషించి నివేదించేందుకు వీలుగా aMap బృందంలో మానసిక శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు, గణాంకనిపుణులు ఉంటారు.

aMap వివరాలకోసం చూడాల్సిన వెబ్‍సైట్ : www.audiencemap.com