• Home »
  • International Channels »
  • భారతదేశ సర్ప జాతులమీద యానిమల్ ప్లానెట్ ప్రత్యేక కథనాల ప్రసారం

భారతదేశ సర్ప జాతులమీద యానిమల్ ప్లానెట్ ప్రత్యేక కథనాల ప్రసారం

అత్యంత విషపూరితమైన 50 పాములతో సహా దాదాపు 300 తెగల పాములున్న భారతదేశంలో అత్యంత ప్రాణాంతకమైన పది పాములను పరిచయం చేస్తూ యానిమల్ ప్లానెట్ ఒక సరికొత్త సిరీస్ ప్రసారం చేయబోతోంది. వాటి కాటు బారినుంచి చాకచక్యంగా తప్పించుకుంటూ నిజెల్ మార్విన్ భారతదేశంలో చేసిన సాహసోపేతమైన యాత్రను “ డెడ్లియెస్ట్ స్నేక్స్ “ పేరుతో ప్రసారమయ్యే ఈ సిరీస్ లో చూడవచ్చు.

యానిమల్ ప్లానెట్ లో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారమయ్యే ఈ సిరీస్ లో మార్వెల్ ఇప్పటికే మలేసియా, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలనుంచి కథనాలు అందించారు. అనేక అద్భుతమైన జాతులను, ప్రాణాంతకమైన జాతులను పరిచయం చేస్తూ వచ్చారు.
ఇప్పుడు తాజాగా తమిళనాడు మొదలుకొని అండమాన్ దాకా, పశ్చిమ కనుమలలోను ప్రయాణిస్తూ మార్వెన్ అనేక పాములను, వాటి తీరుతెన్నులు వివరిస్తారు. భారతదేశంలో అత్యంత పెద్దదైన, పొడవాటిదైన కొండచిలువను పట్టి చూపిస్తారు. టాప్ టెన్ విషసర్పాలను వెతికే క్రమంలో 170 కి పైగా తెగలను మనకు పరిచయం చేస్తారు. ఆ క్రమంలో ఆస్పత్రిపాలుకావాల్సిన పరిస్థితి సైతం ఏర్పడుతుంది