తప్పుడు ప్రకటనలను పట్టించే యాప్

ASCI

తప్పుదారిపట్టించే ప్రకటనలను గుర్తించటానికి వీలుగా అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక యాప్ విడుదలచేసింది. వినియోగదారుల ఫిర్యాదులు స్వీకరించటానికి ఈ మొబైల్ యాపొ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఇది యాండ్రాయిడ్, ఐఓఎస్ లో అందుబాటులో ఉంది.

కంప్యూటర్ల  కంటే ఎక్కువగాస్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిన నేపథ్యంలో ASCI ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంస్థ చైర్మన్ నరేంద్ర అంబ్వానీ చెప్పారు. చాలా సులభంగా డౌన్ లోడ్ చేసుకోగలిగే ఈ ASCI online mobile యాప్ తో ఫిర్యాదు ఏ స్థాయిలో ఉన్నదో కూడా వెంటనే తెలుసుకోవచ్చు.  ఇది నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది.

ఒక ప్రకటన గురించి అనుమానం ఉంటే దాని వీడియో లేదా ఫొటోను జతపరుస్తూ ఫిర్యాదు చేయవచ్చు. ఆ ప్రకటన యు ట్యూబ్ లింక్ ఇచ్చినా సరిపోతుంది.  ఇంతకుముందే రిజిస్టర్ అయిన ఫిర్యాదుల జాబితా కూడా చూడవచ్చు. కంప్లెయింట్ ఇవ్వగానే ఒక కోడ్ వస్తుంది. దాని ఆధారంగా  కంప్లెయింట్ ఏ దశలో ఉన్నదో తెలుస్తుంది. పైగా, ఆ కంప్లెయింట్ దశలో ఏ మాత్రం మార్పు వచ్చినా , ఆ విషయం నోటిఫై అవుతుంది.