• Home »
  • Top Stories »
  • సన్ టీవీకి అనుకూలంగా అటార్నీ జనరల్ గ్రీన్ సిగ్నల్ : 8% పెరిగిన షేర్ ధర

సన్ టీవీకి అనుకూలంగా అటార్నీ జనరల్ గ్రీన్ సిగ్నల్ : 8% పెరిగిన షేర్ ధర

Attorney General

కళానిధి మారన్ ఆధ్వర్యంలోని సన్ నెట్ వర్క్ చానల్స్ కు సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వవచ్చునని అటార్నీ  జనరల్ హోంశాఖకు సూచించారు. దీంతో ప్రస్తుతానికి సన్ నెట్ వర్క్ కు ఊరట లభించినట్టే. ఈ వార్త  వెలువడిన వెంటనే సన్న్ నెట్ వర్క్ వాటాల ధర 8శాతం పెరిగింది. ఉదయం రూ. 309.25 ఉన్న షేర్ ధర  సాయంత్రానికి రూ. 333.55  దగ్గర ముగిసింది.

సన్ గ్రూప్ చానల్స్ చైర్మన్ కళానిధి మారన్ మీద క్రిమినల్ కేసులు, ఆర్థిక నేరాలలో అభియోగాలు  ఉన్నాయంటూ సన్ గ్రూప్ లోని 33 చానళ్ల లైసెన్సుల పునరుద్ధరణకు హోంశాఖ నిరాకరించిన సంగతి  తెలిసిందే. సెక్యూరిటీ క్లియరెన్స్ నిరాకరిస్తూ హోంశాఖ ఇచ్చిన నివేదిక మీద సమాచార, ప్రసారాల శాఖ అటార్నీ జనరల్ అభిప్రాయం కోరగా ఆయన సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వకపోవటం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు.

అంతకుముందు హోంశాఖకు మారన్ లేక రాస్తూ తాను జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని, దేశ భద్రతకు భంగం కలిగించే పనులు చేయలేదని పేర్కొన్నారు. కేవలం ఆరోపణల ఆధారంగా దోషిగా నిర్థారించటం తగదని,  క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎంతోమందికి చానల్స్ ఉన్నా తనమీదనే కక్షసాధిస్తున్నారని ఆరోపించారు. అయితే, ఈ లేఖకు సమాధానం ఇవ్వకుండా కోర్టులోనే సమాధానమివ్వాలని హోంశాఖ భావించింది. ఈ లోపు సమాచార ప్రసారాల శాఖ వారు హోంశాఖ నివేదిక మీద అటార్నీ జనరల్ అభిప్రాయం కోరారు.