• Home »
  • BARC »
  • బార్క్ ఇండియాకు మేక్ ఇన్ ఇండియా పురస్కారం

బార్క్ ఇండియాకు మేక్ ఇన్ ఇండియా పురస్కారం

టీవీ చానల్స్ ప్రేక్షకాదరణను కొలిచే రేటింగ్స్ సంస్థ బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) ఇండియా కు మేక్ ఇన్ ఇండియా పురస్కారం లభించింది. అహమ్మదాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రులు కల్ రాజ్ మిశ్రా, గోవింద్ భాయ్ పటేల్ ఈ పురస్కారం అందజేశారు. ఈ అవార్డు నెలకొల్పిన మొదటి సంవత్సరమే బార్క్ కు రావటం, బార్క్ కూడ కార్యకలాపాలు ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే అందుకోవటం విశేషం.

భారత ప్రేక్షకులు ఏం చూస్తున్నరో లెక్కలు కట్టటానికి రంగంలో దిగిన బార్క్ బృందానికి ఇది తొలి విజయమని, అత్యంత ప్రోత్సాహకరమైన పురస్కారమని బార్క్ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో ఒక్కో లెక్కింపు మీటర్ కు అయ్యే ఖర్చులో ఆరోవంతు ధరకే తయారుచేయటం భారతదేశానికే గర్వకారణమని బార్క్ అభిప్రాయపడింది. ఇందులో భాగస్వాములైన ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ కు, అడ్వర్టయిజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు, ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టయిజర్స్ కు ధన్యవాదాలు తెలిపింది.