• Home »
  • BARC »
  • బార్క్ రేటింగ్స్ కు ప్రభుత్వం ఆమోద ముద్ర

బార్క్ రేటింగ్స్ కు ప్రభుత్వం ఆమోద ముద్ర

టెలివిజన్ రేటింగ్స్ సంస్థ బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్)  తన రేటింగ్స్ ప్రకటించటానికి  సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఆమోద ముద్ర వేసింది. నిరుడు ప్రభుత్వం టీవీ రేటింగ్ ఏజెన్సీలకు మార్గదర్శకాలు జారీచేస్తూ, ప్రభుత్వ నుంచి అనుమతి పొందటం తప్పనిసరి అని పేర్కొన్న సంగతి తెలిసిందే. మూడు నెలలుగా కార్యకలాపాలు నిర్వహించిన మీదట ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది.

టామ్ రేటింగ్స్ మీద రకరకాల విమర్శలు వస్తున్న సమయంలో ప్రభుత్వం కోరిక మేరకు ట్రాయ్ సమగ్రంగా అధ్యయనం చేసి మార్గదర్శకాలు రూపొందించింది. వాటికి అనుగుణంగా యాడ్ ఏజెన్సీలు, చానల్ యాజమాన్యాలు కలిసి ఏర్పాటు చేసుకున్న బార్క్ తనదైన పద్ధతిలో  రేటింగ్స్ లెక్కింపుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకొని పనిచేయటం ప్రారంభించింది. అప్పట్లో రిజిస్ట్రేషన్ పూర్తికాలేదంటూ మంత్రిత్వశాఖ అభ్యంతరం చెప్పటం, బార్క్ అందుకు వివరణ ఇవ్వటం జరిగిపోయాయి. ఇప్పుడు ఆ లాంఛనం కూడా పూర్తయింది.

ఇలా ఉండగా, టామ్ కూడా  సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ దగ్గర రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వ మార్గదర్శకాలలో కొన్నింటిని పాటించకపోవటంవల్ల అనుమతి విషయంలో పరిశ్రమ వర్గాలు ఒకవైపు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా టామ్ మాత్రం ధీమాగా ఉంది. తమ దరఖాస్తు ప్రాసెస్ లో ఉందని టామ్ అధికారులు చెబుతున్నారు.